టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాత్మక చిత్రాలు తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరో బాంబ్ పేల్చబోతున్నాడు. ఫ్యాక్షన్ ను బేస్ చేసుకుని ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కడప పేరుతో రాబోతున్న ఈ సిరీస్ లో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తానంటున్నాడు వర్మ..

Image result for rgv kadapa web series

కాంట్రవర్శీ కింగ్, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ‘కడప రెడ్ల నిజాల’ వెంటపడ్డాడు. ఆ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ తెగ హడావిడి చేసిన వర్మ.. ఇప్పుడు సైలెంట్ గా ‘కడప రెడ్ల నిజాల’ ను బయటకు లాగాలనుకుంటున్నాడు. గతంలో రక్త చరిత్ర అంటూ ఫ్యాక్షన్ ను వైలెన్స్ ను ఓ రేంజ్ లో చూపించాడు.

Image result for rgv kadapa web series

ఈ రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలపై వెబ్ సిరీస్ లను తీసుకొస్తానని వర్మ స్టేట్ మెంట్ ఇచ్చినట్టే.. ప్రెజెంట్ ఫుల్ ఆఫ్ వైలెన్స్ ను జోడిస్తూ.. ‘కడప’ టైటిల్ ను చాలా ఆప్ట్ గా సెట్ చేశాడు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్..  సీజన్ 1 పేరుతో డైరెక్ట్ గా యూట్యూబ్ లో పెట్టేసి.. దాని లింక్ ను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు ఈ కాంట్రవర్శీ కింగ్.

Image result for rgv kadapa web series

ఇక ట్రైలర్ చూస్తుంటే.. నిజంగా ఫ్యాక్షన్ అంటే ఇంత ఘోరంగా.. దారుణంగా.. ఉంటుందా..? అనిపించేలా.. ఒళ్లు ఝలదరించే విధంగా చూపించాడు. వెబ్ సిరీస్ లకు సెన్సార్ తో పనిలేదు కాబట్టి వర్మ రెచ్చిపోయి.. అక్కడక్కడా బోల్డ్ సీన్లతో పాటు.. అన్ పార్లమెంటరీ డైలాగ్స్ కూడా యాడ్ చేశాడు. అంతేనా.. ఈ ట్రైలర్ లో వర్మ తనకి తగ్గట్టే సంచలన కొటేషన్స్ కూడా కోట్ చేశాడు. ఫ్యాక్షన్ అనేది... రాయలసీమ ప్రజల జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేసిందీ.. తన వాయిస్ బ్యాక్ డ్రాప్ తో వినిపించాడు వర్మ. మరి ఇది ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి మరి.!

 


మరింత సమాచారం తెలుసుకోండి: