మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన సినిమా స్పీడ్ పెంచాడని చెప్పాలి. ధ్రువ తర్వాత సుకుమార్ తో రంగస్థలం సినిమా చేస్తున్న చరణ్ ఆ తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే కాకుండా ఈమధ్యనే అర్జున్ రెడ్డి అంటూ అదిరిపోయే హిట్ అందుకున్న సందీప్ వంగతో సినిమా చేయాలని చూస్తున్నాడట.


అర్జున్ రెడ్డి సినిమాతో తన సత్తా ఏంటో చాటిన సందీప్ వంగ అసలైతే శర్వానంద్ తో సినిమా చేయాలని చూశాడు కాని ఎందుకో అది వర్క్ అవుట్ అవలేదు. అయితే ఇప్పుడు రాం చరణ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట సందీప్ వంగ. తను రాసుకున్న లైన్ ఆల్రెడీ సందీప్ కు చెప్పాడట కూడా. ఈమధ్య తరచు రాం చరణ్ తో డిస్కషన్స్ చేస్తున్నాడు సందీప్ వంగ.


సినిమా ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతుందని అంటున్నారు. అయితే అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయినా బోల్డ్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇబ్బంది పెట్టాయి. అందుకే చరణ్ అతనితో సినిమా అనగానే ఫ్యాన్స్ లో కాస్త కంగారు మొదలైంది. చరణ్ తో కూడా అర్జున్ రెడ్డి లాంటి సినిమా చేస్తాడా లేదా అన్నది చూడాలి.


సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న రంగస్థలం మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈమధ్యనే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమాపై ఇంకాస్త క్రేజ్ పెరిగేలా చేసింది. మరి చెర్రి చేస్తున్న ఈ కొత్త ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ చేసుకుంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: