పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అంచనాలను అందుకునేలా ఈ సినిమా టీజర్ ఉంది.


అయితే టీజర్ లో అనిరుద్ మ్యూజిక్ అద్భుతంగా అనిపించింది. సినిమా అత్తారింటికి దారేది సినిమాలా కనిపిస్తున్నా కచ్చితంగా త్రివిక్రం మార్క్ సినిమాగా ఉంటుందని చెప్పొచ్చు. జనవరి 10న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. 1 నిమిషం నిడివితో వచ్చిన ఈ టీజర్ మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషి అయ్యేలా చేస్తుంది.


సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ గ్లామర్ లుక్ లో కనిపిస్తుండగా.. కీర్తి క్యూట్ లుక్స్ తో అలరిస్తుంది. ఖుష్బు పాత్రని రివీల్ చేయలేదు.. సినిమా టీజర్ అంచనాలను అందుకోగా జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కచ్చితంగా రికార్డులను సృష్టించడం ఖాయమని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: