నిన్న సాయంత్రం విడుదలైన ‘అజ్ఞాతవాసి’ టీజర్ పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చడంతో ఈమూవీని భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు కొంతవరకు తెరిపిన పడ్డారు. అయితే ఈ టీజర్ ను విశ్లేషించిన విమర్శకులు మాత్రం ఈటీజర్ పై అణువణువున పవన్ త్రివిక్రమ్ ల ‘అత్తారింటికి దారేది’ మూవీ ప్రభావం కనిపిస్తోంది అంటూ విమర్శకులకు తెర తీస్తున్నారు. సాధారణంగా ఒక కాంబినేషన్ లో వచ్చిన సినిమా హిట్ అయితే ఆ ఎఫెక్ట్ అదే కాంబినేషన్ లో వచ్చే తరువాత సినిమాల పై కనిపిస్తూ ఉంటుంది.


 నిన్న విడుదలైన ‘అజ్ఞాతవాసి’ టీజర్ విషయంలో కూడ ఇదే జరిగింది అన్న విశ్లేషణలు వినిపించడమే కాకుండా ‘అత్తారింటికి దారేది’ ప్రభావం అడుగడుగునా కనిపించింది. ‘అత్తారింటికి దారేది’ లో మాదిరిగానే శాస్త్రీయ సంగీతం నేపధ్యం హీరోయిన్ డ్యాన్స్ సీన్లు హీరో చుట్టూ మందీ మార్బలం హీరోయిన్లతో పవన్ హావభావాలు ఇవన్నీ ‘అజ్ఞాతవాసి’ టీజర్ లో చూసినవారికి  ‘అత్తారింటికి దారేది’ వెంటనే గుర్తుకు వస్తుంది.  


 ‘అత్తారింటికి దారేది’ లో అత్తను కంపెనీకి దగ్గర చేయడానికి అల్లుడు తపన పడితే ఇక్కడ కొడుకును కంపెనీకి దగ్గర చేయడానికి తల్లి ప్రయత్నాలు అంతర్లీనంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ టీజర్ లోని  విజువల్ ఎఫెక్ట్ లు బాగా ఉండటంతో ఈసినిమా క్వాలిటీ విషయంలో త్రివిక్రమ్ తీసుకున్న జాగ్రత్తలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇక ఈ టీజర్ ద్వారా పవన్ తిక్క కూడ బ్యూటిఫుల్ అంటూ త్రివిక్రమ్ చెప్పిన సందేశం పవన్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుంది.  

 

ట్రయిలర్ వచ్చిన ఆనందం పవన్ అభిమానులలో బాగానే కనిపిస్తున్నా పవన్ నోటివెంట పలికిన ఒక పవరఫుల్ డైలాగ్ ఈ ట్రైలర్ లో పెట్టి ఉంటే బాగుండేది అని పవన్ అభిమానులు భావిస్తున్నారు. దాదాపు 140 కోట్ల బిజినెస్ ఈసినిమా పై జరిగిన నేపధ్యంలో ఈసినిమా బయ్యర్లు లాభపడాలి అంటే 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చితీరాలి. మరి పవన్ అభిమానులు ‘అజ్ఞాతవాసి’ ని ఏ స్థాయికి తీసుకువెళతారో చూడాలి..   

 


మరింత సమాచారం తెలుసుకోండి: