రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ మూవీ పై అత్యంత భారీఅంచనాలు ఉన్ననేపధ్యంలో ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం చరణ్ తో పాటు చిరంజీవికి కూడ ఏర్పడినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈసినిమా ఎట్టిపరిస్తుతులలోను బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అన్న ఆలోచనలతో చిరంజీవి ఈసినిమాకు సంబంధించి అనేక సూచనలు కూడ ఇస్తున్నట్లుగా ఇప్పటికే ఫిలిం ఇండస్ట్రీవర్గాలలో వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈమధ్య ఇప్పటివరకు చిత్రీకరించిన ‘రంగస్థలం’ మూవీ రఫ్ కాపీని చూసి చిరంజీవి సుకుమార్ తో ఒక షాకింగ్ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


 ఈసినిమాతో సుకుమార్ ప్రేక్షకులను 1980 ప్రాంతం రోజులలోకి తీసుకు వెళతాడు అనివార్తలు వస్తుంటే ఈమూవీ చిరంజీవి 1981లో నటించిన 'ఊరికిచ్చిన మాట' సినిమా కథతో పోలి ఉంది అంటూ  ‘రంగ స్థలం’ సినిమాలోని కొన్ని సీన్స్ చూసిన తరువాత స్వంయంగా చిరంజీవి సుకుమార్ తో కామెంట్ చేసినట్లు టాక్. అయితే క్రియేటివ్ దర్శకుడుగా పేరుగాంచిన సుకుమార్ సామాన్యంగా తన సినిమాలకు సంబంధించి టేకింగ్ విషయంలో కాని కథ విషయంలో కాని గతంలో వచ్చిన సినిమా కథలను అనుసరించినట్లు ఎప్పుడు వార్తలు రాలేదు.  


 దీనితో చిరంజీవి సుకుమార్ తో అన్న మాటలు వాస్తవాలా లేదా గాసిప్పులా అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. దీనితో చిరంజీవి గతంలో నటించిన ‘ఊరికిచ్చిన మాట’ సినిమాలోని సన్నివేశాలను సుకుమార్ కాపీ కొట్టాడా లేదంటే యాదృశ్చికంగా జరిగిందా అన్న విషయం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రొటీన్ స్క్రీన్ ప్లేకు భిన్నంగా ఉండే సుకుమార్ సినిమాలలోని సన్నివేశాలు కొత్త ట్రీట్మెంట్ తో వెండితెర పై కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థుతులలో సుకుమార్ ‘రంగస్థలం’ పై ఇలాంటి గాసిప్పులు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 1981లో విడుదలైన ‘ఊరికిచ్చిన మాట’ అప్పట్లో మంచి విజయం సాధించింది.


 చిరంజీవి-సుధాకర్ అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమాలో ఊరి కోసం తాపత్రయపడే అన్న పాత్రలో చిరంజీవి కనిపిస్తాడు. ఆ నేపథ్యంలోనే తమ్ముడిని డాక్టర్ చదివించి గ్రామంలోనే ఒక ఆసుపత్రి పెట్టించాలనుకుంటాడు. అలా ఊరివాళ్లంతా కలిసి చేసిన ఆర్థిక సహాయంతో సుధాకర్ పట్నం వెళ్లి డాక్టర్ చదువు పూర్తి చేస్తాడు. కానీ అన్నకు ఊరికి ఇచ్చిన మాటను విస్మరించి పట్నంలోనే డాక్టరుగా స్థిరపడుతాడు. తనను డాక్టర్‌ను చేసిన ఊరిని మరిచిపోయిన తమ్ముడికి అన్న ఎలా కనువిప్పు కలిగించాడన్నది ‘ఊరికిచ్చిన మాట’ మూవీ కథ అయితే ఈసినిమాలో కొన్ని సన్నివేశాలు ‘రంగస్థలం’ లో చిరంజీవికి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ పోలికను తీసుకు వచ్చింది చిరంజీవి అంటూ గాసిప్పులు వస్తున్న నేపధ్యంలో ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియదు. కానీ ప్రస్తుతానికి ‘రంగస్థలం’ చుట్టూ గాసిప్పులు బాగానే హడావిడి చేస్తున్నాయి.. 








మరింత సమాచారం తెలుసుకోండి: