భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఆశపడుతూ అఖిల్ నటించిన ‘హలో’ కు నాని ‘ఎంసిఎ’ తో ఏర్పడిన పోటీ నాగార్జునకు టెన్షన్ కలిగిస్తున విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో నిన్న ఒక ప్రముఖ ఛానల్ ఇంగ్లీష్ టైటిల్స్ తో సినిమాలు తీసే అక్కినేని నాగార్జునను ప్రపంచ తెలుగు మహాసభలకు ఎలా అతిధిగా పిలిచారు అంటూ ఆసక్తికర కార్యక్రమం నిర్వహించింది. నాగార్జున నటంచిన మరియు  తీసిన చాలాసినిమాలు ఇంగ్లీష్ టైటిల్స్ తో ఉంటాయి అంటూ అఖిల్ ‘హలో’ ని హైలెట్ చేస్తూ ఈ చర్చా కార్యక్రంలో ‘హలో’ మూవీలోని పాటలను స్టిల్స్ ను తెగ చూపెట్టారు.


 వాస్తవానికి ఈ ఛానల్ ల్ నిర్వహించిన కార్యక్రమంలోని ఈ విషయాలు మరీ అతిగా అనిపించినా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ లోపాలను టార్గెట్ చేస్తూ మధ్యలో ఈ కార్యక్రమానికి అతిధిగా నాగార్జునను ఎలా పిలిచారు అని ప్రశ్నిస్తూ ప్రసారం అయిన ఈ కార్యక్రమంలో అఖిల్  ‘హలో’ టార్గెట్ అయింది. ఇది ఇలా ఉండగా అఖిల్ మొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ రెండో సినిమాకు మంచి శాటిలైట్ బిజినెస్ వచ్చింది అని వార్తలు వస్తున్నాయి.


 తెలుస్తున్న సమాచారంమేరకు అఖిల్ నటించిన హలో సినిమాను ఒక ప్రముఖ ఛానల్ 5కోట్ల 90 లక్షల రూపాయలకు డీల్ సెట్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అఖిల్ మొదటి సినిమాను కూడ భారీ మొత్తానికి ఇదే ఛానల్ కొనుకున్నా మంచి రేటింగ్స్ రాకపోయినా తిరిగి ధైర్యంగా ఈస్థాయిలో అఖిల్ పై ఆ ఛానల్ పెట్టుబడి పెట్టడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

 

ఇది ఇలా ఉంటే ఈమూవీ ఇప్పటి వరకు 29కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ లోకి రావాలంటే ఖర్చులన్నీ కలుపుకొని కనీసం 33కోట్ల రూపాయలు కలక్షన్స్ రావాలి అన్న వార్తలు వస్తున్నాయి. కేవలం క్రిస్మస్ సెలవులను నమ్ముకుని నాగార్జున చేస్తున్న ఈ ప్రయోగం ఒక విధంగా నాగ్ కు 33 కోట్ల టెన్షన్ ను క్రియేట్ చేస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: