రెండేళ్ల గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా దిల్ రాజు నిర్మించగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా ప్లాన్ చేసుకున్నాడు రవితేజ. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల హిట్ తో సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కళ్యాణ్ కృష్ణ.


అసలైతే మూడవ సినిమా కూడా అక్కినేని నాగార్జునతో బంగార్రాజు సినిమా చేయాల్సి ఉండగా స్టోరీ అంత పర్ఫెక్ట్ గా కుదరకపోవడంతో తర్వాత కలిసి చేద్దామని ఈలోగా వేరే సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు కళ్యాణ్ కృష్ణ. రీసెంట్ గా రవితేజకు కథ సిద్ధం చేయడం మాస్ రాజా ఓకే చెప్పడం అంతా జరిగింది. 


అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకోగా రవితేజతో సినిమా అయితే ఆమె నో అని చెప్పిందట. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో రారండోయ్ తో ఆమెకు హిట్ ఇవ్వగా రవితేజతో ఆమెకు కిక్-2 ఫ్లాప్ సెంటిమెంట్ ఉంది. అందుకే రవితేజ సినిమాకు సారీ అని చెప్పేసిందట. 


ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు కూడా అంతగా లేవు. అయినా సరే రవితేజ సినిమాను కాదనడానికి కారణాలు ఏవై ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అమ్మడు తెలుగు తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: