క్రేజీ బ్యూటీ కాజల్ రెండేళ్ల క్రితం దాకా కెరియర్ ముగిసింది అన్న పరిస్థితులు ఉండగా అనూహ్యంగా అమ్మడికి మళ్లీ డిమాండ్ పెరిగింది. ఖైది నంబర్ 150తో చిరు ఛాన్స్ తో పాటుగా రానా నేనే రాజు నేనే మంత్రితో కూడా హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటుంది. 


కాజల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఎం.ఎల్.ఏ. కళ్యాణ్ రాం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర మాధవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. సినిమాలో కాజల్ అందాలతో రెచ్చిపోయిందట. తన మొదటి సినిమా హీరో అయ్యే సరికి ఏమాత్రం అడ్డు చెప్పట్లేదట కాజల్.


సినిమాలో ఆమె ఎన్నారై రోల్ చేస్తుండగా అమ్మడు అందాలన్ని గుమ్మరించేస్తుందని తెలుస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కాజల్ అందాల విందులో తడిసి ముద్దయ్యేలా ప్లాన్ చేశారట. కెరియర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు కూడా కాజల్ ఇలా అందాల ప్రదర్శన చేయలేదు. అయితే ఇప్పుడు అమ్మడు మరిన్ని అవకాశాలను రాబట్టుకునేందుకు ఇలా చేస్తుందని అంటున్నారు. 


తెలుగు, తమిళ భాషల్లో కాజల్ క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. మరి ఆ ఇమేజ్ ను మరింత పెంచుకునేందుకు కాజల్ ఎం.ఎల్.ఏ సినిమాలో స్పెషల్ లుక్ లో సర్ ప్రైజ్ ఇస్తుందట. మరి అమ్మడు ఎంతగా రెచ్చిపోయిందో సినిమా చూస్తేనే గాని చెప్పలేం. 


మరింత సమాచారం తెలుసుకోండి: