తెలుగు ఇండస్ట్రీలో 'మహాత్మ', 'ఒంటరి', 'నిప్పు' వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చకున్న హీరోయిన్ భావన.   మళియాళ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన భావన ఆ మద్య తన కారు డ్రైవర్ల చే లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే.  అయితే ఈ అంశంపై సీరియస్ అయిన భావన వారికి కఠినంగా శిక్ష పడే వరకు పోరాటం చేసింది. ఆ సమయంలో యావత్ భారత సినిమా ఇండస్ట్రీ వర్గం నటి భావనకు తమ సంఘీభావం తెలిపింది. 
Image result for actress bhavana
ఇది జరిగిన కొన్ని రోజులకు  భావన తను ప్రేమించిన నవీన్‌తో నిశ్చితార్ధం చేసుకుంది.  ఈ ఏడాదిలో మార్చి నెలలో వీరి ఎంగేజ్మెంట్ జరగగా.. అక్టోబర్‌లో పెళ్లి పెట్టుకున్నారు. కానీ అనుకున్నట్లుగా పెళ్లి మాత్రం జరగలేదు. దీంతో భావన పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. భావన పెళ్లి వాయిదా పడటంతో రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి..అయితే దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది భావన. 
Image result for actress bhavana
ప్రస్తుతం తాను సినిమా షూటింగ్ లో ఉండటం వల్లే పెళ్లి క్యాన్సల్ చేసుకోవాలసి వచ్చిందని తెలిపింది.  ఈ మధ్య కాలంలో చిత్రసీమలో ఇలా నిశ్చితార్ధాలు జరుపుకోవడం పెళ్లి క్యాన్సిల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. భావన పెళ్లి కూడా అలానే క్యాన్సిల్ అయిందని అంతా అనుకున్నారు. అయితే అవన్నీ వట్టి పుకార్లుగా తేల్చేస్తూ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యిందట భావన.
Image result for actress bhavana
వాస్తవానికి అక్టోబర్‌లో పెళ్లి అనుకున్నా.. ఆ ముహూర్తాన్ని కాస్త డిసంబర్ 22కి వాయిదా వేసుకున్నారట. కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల మధ్యన త్రిస్సూర్‌లో వీరి వివాహం జరగబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: