అలనాటి అందార తార శ్రీదేవి డాటర్ జాన్వీకపూర్ ట్రెండీ లుక్స్‌తో అదరగొట్టేస్తోంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే కొత్త కొత్త స్టిల్స్‌లో కనిపిస్తూ..కుర్రకారు మనసు దోచేసింది.  జాన్వీకపూర్ గత కొన్ని నెలలుగా బాంద్రాలోని డ్యాన్స్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.  అంతే కాదు తన ఫిట్ నెస్ కోసం ఈ అమ్మడు జిమ్ లో గెత కష్టపడి పోతుంది.   
Image result for sridevi jhanvi
శ్రీదేవిని నాటి సౌందర్యారాధులకు ఆరాధిస్తే.. ఆమె కుమార్తె జాన్వి నేటి తరాన్ని తన అందంతో మత్తెక్కిస్తోంది. ముగ్ధమోహన సౌందర్యానికి మారుపేరుగా మారిన జాన్విని వెండితెరమీద ఆవిష్కరించేందుకు ప్రఖ్యాత దర్శకుడు కరణ్‌ జోహార్‌ సిద్ధమైన విషయం తెలిసిందే. ధడక్‌ పేరుతే రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులైలో విడుదల కానుంది.
Image result for జాన్వీ
ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తమ ప్రేమను బతికించుకోవడానికి కుల వివక్షపై పోరాటం చేసే ప్రేమికుల కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.  మరోవైపు, ఇంతవరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా జాన్వీకి భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది.

ఆమె ట్విట్టర్ ను ఎంతో మంది ఫాలో అవుతున్నారు. ఆమెకు సంబంధించిన ఏ వార్త అయినా వైరల్ అవుతోంది. ఆమె అందానికి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ట్రైనర్ సహాయంతో వర్కౌట్లు చేస్తోంది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: