టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున వారసుడిగా వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్.  అయితే ఈ సినిమా మొదటి నుంచి భారీ అంచనాలు పెంచుతూ వచ్చింది..కానీ థియెటర్లో బొమ్మ పడిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. కాకపోతే ఈ సినిమాతో అఖిల్ కి మంచి మార్కులు పడ్డాయి. 
Image result for akhil Hello stills
హీరోగా ఉండాల్సిన డ్యాన్స్, యాక్షన్, నటన అన్నీ ది బెస్ట్ అనిపించుకున్నాడు.  ప్రస్తుతంమనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ చిత్రంలో నటిస్తున్నాడు. మొదటి సినిమా ఫ్లాప్ తర్వాత అఖిల్ చేస్తున్న రెండో సినిమా కావడం.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వస్తుండటంతో.. సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
Image result for akhil Hello stills
యాక్షన్ సీక్వెన్స్ గురించి చేస్తున్న ప్రచారం కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఒక రకంగా బజ్ రీత్యా.. హలోకి మంచి డిమాండ్ పెరిగింది.  తాజాగా అఖిల్ నటించిన ‘హలో’ చిత్రానికి సెన్సార్ నుంచి ‘యూ’ సర్టిఫికెట్ వచ్చింది.  విక్రమ్ కె కుమార్ బ్యూటీఫుల్ ప్రజేంటేషన్ మరోసారి మ్యాజిక్ చేస్తే అఖిల్‌కు హిట్టు ఖాయం. యూత్‌ను ఎట్రాక్ట్ చేసేలా ఉన్న యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: