2017 హిట్ సినిమాల లెక్క ఎలా ఉన్నా అర్జున్ రెడ్డి అనే సినిమా తెలియని సిని ప్రేక్షకుడు ఉండడని చెప్పొచ్చు. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా షాలిని పాండే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ ఒక్క సినిమాతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. చేసింది ఒక్క సినిమానే కాని అర్జున్ రెడ్డి పాపకు ఓ రేంజ్ లో పాపులారిటీ వచ్చేసింది.


తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమాతో ఐడెంటిటీ తెచ్చుకున్న షాలిని పాండే ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం తెలుగులో ప్రెస్టిజియస్ గా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో నటిస్తున్న అమ్మడు సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన 100% లవ్ తమిళ రీమేక్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో ముందు లావణ్య త్రిపాఠిని అనుకుని మరి షాలిని రెడ్డిని సెలెక్ట్ చేశారంటే అమ్మడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఊహించవచ్చు.


ఇక ఈమధ్య తనకు వచ్చిన ఈ పాపులారిటీని మరింత పెంచుకునేలా షాలిని పాండే ప్రయత్నాలు ఉన్నాయని చెప్పొచ్చు. రీసెంట్ గా జరిగిన జీ గోల్డెన్ అవార్డ్స్ లో అమ్మడి స్కిన్ షో చూపరులను గుటకలు వేసేలా చేసింది. బ్లాక్ కాస్టూం లో అమ్మడు అందాలతోనే కాదు ఓర చూపులతో కూడా ఊపేస్తుంది.


ఇక ఆ కాస్టూంలో ఫోటో షూట్ కూడా లాగించేసింది. తన మార్క్ క్యూట్ స్టిల్స్ తో ఆకట్టుకున్న షాలిని పాండే కచ్చితంగా తెలుగులో పెద్ద స్టార్ అయ్యే లక్షణాలు ఉన్నాయని అంటున్నారు. ఈలోగా ప్రేక్షకులకు కూడా తన స్టిల్స్ తో పిచ్చెక్కించేస్తుంది అమ్మడు.   



మరింత సమాచారం తెలుసుకోండి: