ఈరోజు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పాటుగా తమిళ తంబీల చేత గుడి కట్టించుకున్న హన్సికది కూడా పుట్టినరోజు చిన్న వయస్సులోనే కోలీవుడ్ కు వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్న హన్సిక తన ప్రతి పుట్టినరోజు నాడు కొంతమంది అనాధ పిల్లలను దత్తత చేసుకోవడం హన్సికకు అలవాటు. అదేవిధంగా తన పుట్టినరోజు నాడు కేన్సర్ లాంటి వ్యాధులకు గురి అయిన పేద మహిళలకు సాయం కూడా చేస్తూ ఉంటుంది. నేడు తన జరుపు కుంటున్న 22వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 22 మంది పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనాపాలనా చూడటమే కాకుండా ఈరోజు తన పుట్టినరోజును ముంబైలోని ఆ అనాధ పిల్లల సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంది హన్సిక.

ఈ పుట్టినరోజును విష్ చేస్తూ హన్సిక ప్రియ నేస్తం హీరో శిoభు హన్సికను  గ్రీట్ చేస్తూ తన సందేశాన్ని ట్విట్టర్ లో పెట్టడమే కాకుండా ఈ ఇరవై రెండు మంది పిల్లల అనాధ తల్లికి బడా కేక్ పంపించాడు హన్సిక శిoభూల ప్రేమకు గుర్తుగా. మరి ఈ మధ్యనే హన్సికతో తన కుటుంబానికి ఎటువంటి సంబందం లేదని మీడియాతో అన్న శింభు తండ్రి రాజేంద్ర ఈ అనాధ పిల్లల తల్లిని కొడలుగ అంగీకరిస్తాడో లేదో చూడాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: