చిరంజీవి కుమారుడు  రాంచరణ్ అనే కదా ‘ఎవడు’ సినిమాను సమైక్యవాదులు అడ్డుకుంటామనడం, దానిని వాయిదా వేయడం జరిగింది. అలాంటిది దానికంటే ముందుగా ఏకంగా చిరంజీవి సినిమా తెరపైకి వస్థే ఏమైనా ఉందా...సమైక్యవాదులు ఆ సినిమా పట్ల అగ్గిమీద గుగ్గిలం కారూ... కాని వస్థున్నాడు అంటున్నాడు ఆసినిమా డైరెక్టర్.

తెలుగుతెరపై మల్టీస్టారర్లతో తీసిన జగద్గురు ఆదిశంకర సినిమా త్వరలో విడుదల కాబోతోంది. భారవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈసినిమాలో నాగార్జున, మోహన్ బాబు, శ్రీహరి లు ఉన్నారన్న సంగతి అందరికి తెలుసు, వీరే కాదు కొన్ని సన్నివేశాలు చిరంజీవి నటించినవి కూడా ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే  రాంచరణ్ ‘ఎవడు’ కంటే ముందుగా మెగాస్టార్ సినిమా మెగా అభిమానులను అలరించేందుకు వస్థోందన్న మాట.

అయితే ఇది చిరంజీవి 150వ సినిమా మాత్రం కాదు, ఈ సినిమా కోసం కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి సమయం తీసుకుని నటించింది లేదు. ఈ సినిమాలో ఆయన వాయిస్ ఓవర్ ఉంది. అంతేకాదు కొన్ని పతాక సన్నివేశాలున్నాయి. అవి మంజునాథ సినిమాకోసం చిత్రీకరించి చివరికి అందులో పెట్టకుండా వదిలేసిన సీన్స్. ఈ సినిమాకు కూడా డైరెక్టర్ భారవినే. అందుకే వాటిని ‘ఆదిశంకర’ లో పెట్టారు. ఇలా నయినా చాలా రోజుల తర్వాత ఓ కొత్త సినిమాలో మెగాస్టార్ కనిపించబోతున్నాడన్న మాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: