ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్  అందాన్ని ఆరాధించని వారు ఉండరు. ఆమె ఆరాధ్యకు తల్లి అయినా ఆమె నటిస్తే చాలు అంటున్న నిర్మాతలు, దర్శకులు ఉన్నారు, ఇక అభిమానుల సంగతి చెప్పనవసరం లేదు. ఇక లేటెస్ట్ గా అటువంటి ప్రపంచ సుందరిని ముద్దు పెట్టుకుంటూ ఫోటోలకు క్లిక్ మనిపించిన ఒక ఫోటో వెబ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ అందాల సుందరి ఐశ్వర్య ను ముద్దు పెట్టుకున్నది, ఎవరో కాదు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు  జిమ్ సంజీరో ఐశ్వర్యరాయ్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తున్న L Oreal కాస్మోటిక్ ప్రోడక్ట్ ప్రచార చిత్రం కోసం ఒక యాడ్ ను తయారు చేయడానికి ఆయన ఇండియా వచ్చాడు.

ఆ యాడ్ షూటింగ్ లో ఇప్పటికీ ఎంతో అందంగా కనిపిస్తున్న ఐశ్వర్య ఐస్ అయిపోయి అమాంతం ఐశ్వర్య ను ముద్దు పెట్టుకున్నాడట. అనుకోని ఈ సంఘటనకు మన ప్రపంచ సుందరి ఆనంద పడటమే కాకుండా ఆ ఫోటోను తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేసింది. ఆరాధ్య పుట్టిన తరువాత సినిమాలకు పూర్తిగా దూరమైనా ఐశ్వర్య ప్రస్తుతం తన దృష్టి అంతా యాడ్స్ పైనే పెడుతోంది. ఈ మధ్య ఐశ్వర్య సంజయ్ లీలా భన్సాలి నిర్మిస్తున్న ‘రామ్ లీలా’ సినిమాలో ఐటం సాంగ్ చేస్తోంది అంటూ పుకార్లు వినిపించాయి. తరువాత ఈ వార్తలను దర్శక నిర్మాతలు ఖండించారు. సినిమాలలో నటించినా నటించకపోయినా ఐశ్వర్య ఎప్పుడూ బాలీవుడ్ ‘మహారాణి’...

 



 

మరింత సమాచారం తెలుసుకోండి: