వరుసగా రెండు హిట్స్ వచ్చిన తరువాత ప్రస్తుతం నితిన్ కెరియర్ మంచి జోష్ మీద ఉంది. ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అంటూ గౌతం మీనన్ తో, పూరి జగన్నాద్ కలిసి ‘హార్ట్ ఎటాక్’ అంటూ వస్తున్నాడు. గతంలో పరాజయాలు వరుస పెట్టి వస్తున్న రోజులలో నితిన్ హీరోగా ‘సీతారాముల కళ్యాణం’ అనే సినిమా వచ్చింది. ఆరోజులలో నితిన్ కు లక్ లేదు కాబట్టి ఆ సినిమా పెద్దగా హిట్ అవలేదు ఈ సినిమాలో నితిన్ తో హన్సిక జంటగా నటించింది. ప్రస్తుతం హన్సిక క్రేజ్ విపరీతంగా తమిళనాట ఉండటంతో ఈసినిమాను ‘రౌడీ కొట్టే’ గా అనువాదం చేస్తున్నారు.

హీరోయిన్ గా హన్సిక ఉండటంతో ఈ సినిమా బిజినెస్ కోలీవుడ్ లో చాలా మంచి బిజినెస్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. నితిన్ కు హీరోగా కోలీవుడ్ లో పెద్దగా పేరు లేకపోయినా హన్సిక అదృష్టంలో కొంతైనా తనుకు అంటుకుని కోలీవుడ్ లో కూడా పాగా వేయాలని ఈసినిమా ద్వారా ప్రయత్నిస్తున్నాడు నితిన్ అని అంటున్నారు. పరాజయాల బాటలో ఉన్నప్పుడు నితిన్ కు నేత్యామీనన్ గోల్డెన్ హీరోయిన్ గా మారినట్లుగా తమిళ ప్రేక్షకులచే గుడిలు కట్టించు కుంటున్న హన్సిక లక్ నితిన్ కు కలిసి వస్తే ప్రస్తుతం అతడు నటిస్తున్న తెలుగు సినిమాలన్నీ కోలీవుడ్ లోకి డబ్ అయిపోతాయి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: