టాలీవుడ్‌లో స్లో పాయిజ‌న్‌లా ఎంట్రి ఇచ్చి ఒక్క పోకిరి మూవీతో రాత్రికి రాత్రే స్టార్‌డంను సంపాదించుకోగ‌లిగి బ్లాక్ బ్యూటీ ఐటెం గ‌ర్ల్, ముమైత్‌ఖాన్‌. ముమైత్‌ఖాన్ మ‌రో ద‌శాబ్థం టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు దొరికిన ఎవ‌ర్‌గ్రీన్ ఐటెం నెంబ‌ర్ అనుకున్న టాలీవుడ్‌కి నిరాశే మిగిలింది. ఎందుకంటే ముమైత్‌తో మ‌రింత  అందాన్ని తీసుకోవాల‌నుకున్న టాలీవుడ్ కోరిక‌కు వ్యతిరేకిగా మారింది. దీంతో క‌న్నెర్ర చేసిన టాలీవుడ్ కోపానికి ముమైత్‌కి అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. ఐటెం నుండి హీరోయిన్ వ‌ర‌కూ న‌టించిన ముమైత్‌, ఓ స్టేజ్‌లో హీరోయిన్‌ను మించిన‌ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింది. నిర్మాత‌లు కాద‌న‌లేక ఆ ముమైత్ అడిగినంత ఇచ్చేశారు.

అయితే ష‌డ‌న్‌గా ముమైత్ కెరీర్ స్లో అవ‌డానికి కార‌ణం ఏంటో ఎవ‌రికి అర్ధం కాలేదు. స్టార్‌డం నెత్తికెక్కిన త‌రువాత ముమైత్ చెప్పే మాటల్లోనూ, అడుగుతున్న రెమ్మున‌రేష‌న్‌లోనూ చాలా తేడాలొచ్చేశాయంట‌. మైస‌మ్మ ఐ.పి.య‌స్ మూవీ త‌రువాత దాదాపు 60 ల‌క్షల పారితోషికాన్ని ఆశిస్తున్నట్టు నిర్మాత‌ల‌కు చెప్పడంతో ఆ బ్లాక్ ఐటెంను ప‌క్కన పెట్టాల్సి వ‌చ్చింది. అవ‌కాశాల లేక‌పోయినా, ఎట్ ప్రెజెంట్ ముమైత్ త‌న ప్రెండ్స్‌తో స‌ర‌దాగా జీవితాన్ని గ‌డిపేస్తుంది. మంచి ఫాంలో ఉన్నప్పుడే దాదాపు ఆస్తుల‌ను కూడ‌బెట్టింది. ఇప్పుడు వాటితో ఎంజాయ్ చేస్తుంది ఈ బ్లాక్ ఐటెం బేబి.

మరింత సమాచారం తెలుసుకోండి: