సమైఖ్య ఉద్యమాల సెగతో ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అల్లాడి పోతున్నా, మరొకవైపు రాష్ట్రం యావత్తూ పెళ్ళిళ్ళ సందడితో హడావుడి చేస్తుంది. టాలీవుడ్ సెలబ్రిటీల కుటుంబాల నుండి సామాన్య ప్రజల కుటుంబాల వరకూ ఎక్కడ చూసిన పెళ్లి హడావుడే కనిపిస్తోంది. పెళ్లి చేసుకుంటూ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బిజీగా ఉన్నా ఆ పెళ్లి చూడడానికి వచ్చేవారు మాత్రం గుంపులు గుంపులుగా చేరి పడిపోతున్న రూపాయి విలువ దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాల వరకూ వారి వారి అభిరుచిని బట్టి మాట్లాడుకుంటూ సరదాగా కాలం గడిపేస్తూ ఉంటారు.

ఈ విషయాలతో పాటు పెళ్లిళ్లకు వచ్చిన చాలామంది మెగా కుటుంబ హీరోల సినిమాల విడుదల గురించి కూడా మాట్లాడుకోవడం అందరిని ఆశ్చర్య పరచడమే కాకుండా అసలు ఆ సినిమా గురించి ప్రజలు అంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారా..? అని అనిపించేట్లు చేస్తోంది. ఈ మధ్య జరుగుతున్న కొన్ని పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మధ్య కట్టే తెరపై ‘అత్తారింటికి దారేది...తెర తీస్తే కనిపిస్తోంది..’ అనే క్యాప్షన్స్ కనిపించడం పెళ్ళికి వచ్చిన వారందరినీ ఆశ్చర్య పరచడమే కాకుండా మెగా కుటుంబాల సినిమాలపై సెటైర్లు పేలడం అందరికీ నవ్వులు తెప్పిస్తోంది. మెగా కుటుంబ సినిమాలను ఆడనివ్వం అంటూ కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రతిజ్ఞలు పెరిగిపోతూ ఉంటే ఈ ఒత్తిడికి తలొగ్గి పవర్ స్టార్ లాంటి పవన్ కళ్యాణ్ కూడా తన ‘అత్తారింటికి దారేది’ సినిమాకు దారి ఎప్పుడో చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు మన పవర్ స్టార్.

పవనిజం తో రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలలోనూ అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా జరుగుతున్న ఉద్యమ సెగలను చూసి బెదిరి వెనుక అడుగు వేస్తున్నారు అంటే ప్రస్తుతం ఏ ఒక్క నాయకుడు లేకపోయినా ప్రజలే స్వచ్చంధంగా బయటకు వచ్చి అన్నీ తామై నడుపుకుంటున్న ప్రస్తుత సమైఖ్య సెగలు టాలీవుడ్ ను ఏ స్థాయిలో కుదిపేస్తున్నాయో అర్ధం అవుతుంది.కాని సర్వాంతర్యామిగా భగవంతుడు ప్రతి చోటా ఉన్నట్లుగా పవనిజం మాయతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెళ్లి పందిళ్లను కూడా వదలాక్ పోవడం ఆశ్చర్యకరమే. దట్ ఈస్ పవన్ పవనిజం పవర్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: