టాలీవుడ్‌లో సింగర్స్ లేన‌ట్టు కోలీవుడ్ నుండి హీరోల గొంతును అరువు తెచ్చుకుంటున్నారు మ‌న టాలీవుడ్ హీరోలు, సంగీత ద‌ర్శకులు. వీరు చేస్తున్న వేషాల‌కు ఆ మూవీలు ఫ‌ట్ అవుతున్నాయి. త‌ను పాడితే మూవీకు హైప్ క్రియోట్ అవుతుందంటూ బ్రమ‌లో ప‌డి, వ‌చ్చి రాని భాష‌లో పాట‌ను పాడి ఆ మూవీకు ప‌రోక్షంగా ప్లాప్ అవ‌డానికి స‌హాయ‌ప‌డుతున్నాడు. త‌ను ఎవ‌రో కాదు, త‌నే త‌మిళ్ యాక్టర్ శింబు. శింబు రీసెంట్‌గా త‌క్కువ కాలంలోనే రెండు మూవీల‌లో పాట‌ను పాడాడు. అందులో ఒక మూవీ అంతంత మాత్రంగా ఉండ‌టంతో, మ‌రొక‌టి ప్లాప్ ఖాయం అంటున్నారు. బాద్‌షా మూవీలో శింబు పాట పాడాడు. కాని ఆ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద చ‌తికిల ప‌డ‌టంతో శింబు క‌ష్టప‌డి పాడిన పాట‌కు అర్ధం లేకుండా పోయింది.

ఇప్పుడు మంచు మ‌నోజ్ మూవీ పోటుగాడులో శింబు ఓ పాట పాడాడు. ఇదీ అంతంత మాత్రంగానే ఉంది. మంచు మ‌నోజ్ అస‌లే హిట్ కోసం విశ్వప్రయ‌త్నాలు చేస్తుంటే శింబు పాట‌తో అంత‌సీన్ లేద‌ని తేలిపోయిందంటున్నారు విశ్లేష‌కులు. శింబు పాట పాడాడంటే అ మూవీకు క‌ష్టాలు త‌ప్పవ‌నే నెగిటివ్ టాక్ టాలీవుడ్‌లో బాగానే వినిపిస్తుంది. ఎంత ప్రెండ్స్ అయినా ఇలా పాట పాడించుకొని సినిమాను ప్లాప్ చేయించుకోవ‌డం స‌రికాదంటున్నారు టాలీవుడ్ శ్రేయోభిలాషులు. బాద్‌షా మూవీ లో శింబు పాడిన పాట మొద‌టి రెండు వాక్యాలు ఓకె అనిపించినా త‌రువాత పాట‌లో విష‌యం ఏమి ఉండ‌దు. అంతే కాకుండా శింబు పాడిన ఆ పాట‌కు అంత ఫేం కూడా రాలేదు. మ‌రి ఈ కోళీవుడ్ హీరో పాట‌ను ఎందుకు కోరుకుంటున్నారో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: