ఒక అడుగు ముందుకు, మరొక అడుగు వెనుకకు గా నడిచిన రామ్ చరణ్ ‘తూఫాన్’ ఎట్టకేలకు తెలుగు తెరపై తూఫాన్ సృష్టించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ శిల్ప కళా వేదిక లో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా చేయడానికి నిర్మాతలు అన్ని ప్రయత్నాలు పూర్తి చేశారు. అయితే చెర్రీ అభిమానులకు షాకింగ్ న్యూస్ ఏమిటంటే రామ్ చరణ్ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈరోజు సాయంత్రం జరిగే ఆడియో వేడుకకు రావడం లేదట.

ప్రియంకాను ఈరోజు జరిగే ఆడియో ఫంక్షన్ కు తీసుకు వద్దామని చరణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రియాంక రాకుండా తనకు ముంబై లో జరుగుతున్న ఈ సినిమా హిందీ వెర్షన్ ‘జంజీర్’ ప్రమోషన్ వర్క్ లో బిజీగా ఉంది అని తప్పించుకున్నట్లు సమాచారం. దీనితో తమ అభిమాన హీరో చరణ్ తో ప్రియాంకా ను చూద్దామనుకున్న మెగా అభిమానుల ఆశలపై నీళ్ళు పడినట్లే అంటున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు జరిగే ఆడియో ఫంక్షన్ కు రాజకీయ కారణాల రిత్యా చిరంజీవి రావడం లేదు. పవన్ కళ్యాణ్ ఎలాగూ రాడు కాబట్టి మొట్టమొదటి సారిగా రామ్ చరణ్ కెరియర్ లో టోటల్ గా చెర్రీ నే బేస్ చేసుకొని జరుగుతున్న ఆడియో ఫంక్షన్ గా ‘తూఫాన్’ ఆడియో లాంచ్ జరగబోతోంది. దీనితో మెగా హీరోలు ఎవరూ లేకుండా కేవలం చెర్రీ మాత్రమే కనిపించే ఈ ఆడియో ఫంక్షన్ కు మెగా అభిమానుల ప్రతి స్పందన ఎలా ఉంటుంది అనే విషయం పై ఆశక్తికర చర్చ ఫిల్మ్ నగర్ లో జరుగుతుంది.

మరొక ఆశక్తికర పరిణామం ఏమిటంటే సమైఖ్యఆంద్ర ఉద్యమం పై భయపడి రిలీజ్ లను వాయిదా వేస్తున్న బడా హీరోల మెగా సినిమాలలో మొట్టమొదటిగా ధైర్యం చేసి సెప్టెంబర్ మొదటి వారంలో సీమాంధ్రలో ప్రవేశిస్తున్న సినిమాగా రామ్ చరణ్ తూఫాన్ కు క్రెడిట్ తగ్గుతుంది. ఈ ప్రయోగం విజయవంతం అయి ఎటువంటి హడావుడి జరగకుండా చెర్రీ సినిమా సీమంధ్ర ప్రాంతంలో నడవగలిగితే తన బాబాయి సినిమా ‘అత్తారింటికి దారేది’ సినిమాకు దారి చూపించిన రియల్ హీరోగా రామ్ చరణ్ చరిత్ర సృష్టిస్తాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: