వెండితెర మన్మధుడు కింగ్ నాగార్జున ఏమి చేసినా విభిన్నంగా చేస్తాడని అంటారు. అందుకే నాగ్ తాను చేపట్టిన చాలా వ్యాపారాలలో విజయాన్ని సాధించాడు. ఐదు పదుల వయసు ధాటి పోతున్నా ఇప్పటికి మన్మధుడి లాగే మెరిసిపోతున్న నాగార్జున కు ఒకమంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి అనే ఆలోచన తో గత మూడు సంవత్సరాలుగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా ఆ సూపర్ హిట్ మాత్రం నాగ్ కు అందని ద్రాక్ష పండులా ఊరిస్తూనే ఉంది. ఈ పరిస్థితులలో ఏదో విధంగా సూపర్ హిట్ కొట్టి తీరాలి అనే ఉద్దేశంతో తన సొంత బ్యానర్ పై వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించిన ‘భాయ్’ సినిమాపై కింగ్ నాగార్జున చాలా ఆశలే పెట్టుకున్నాడు.

ఈ సినిమా ట్రైలర్ కు కూడా లక్షల సంఖ్యలో హిట్స్ రావడం నాగార్జున కెరియర్ కు మళ్ళి శుభారంభంగానే అనుకున్నారు అంతా. ఈ సినిమాను తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు నాడు వచ్చే నెల 20 వ తారీఖున విడుదల చేద్దామని నాగ్ భావించి దానికి తగ్గట్టుగా సెప్టెంబర్ 1 వ తారిఖు నాడు ఈ సినిమా ఆడియో ను విడుదల చెయ్యడానికి కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఆఖరు నిమిషంలో నాగ్ తన ఆలోచనలను మార్చుకొని భాయ్ సినిమా విడుదలను వాయిదా వేయడం అందరినీ ఆశ్చర్య పరచింది. రాష్ట్రంలో సమైఖ్య ఉద్యమం జరుగుతున్నా ఆ ఉద్యమ సెగలకూ, నాగార్జున కూ ఎటువంటి సంబంధమూ లేదు. ఈ పరిస్థితులలో నాగ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటూ అందరూ ఆశ్చర్య పోయారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం నాగార్జున భయపడింది సీమంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాల గురించి కాదు తెలంగాణ ప్రాంతంలోని కొన్ని రాజకీయ శక్తుల గురించి నాగార్జున భయపడుతున్నాడట. ఆ మధ్యన నాగార్జున కు సంబంధించిన నాగ్ కన్వెన్షన్ సెంటర్ స్థల వివాదం గురించి కొంతమంది తెలంగాణా రాజకీయ వేత్తలతో నాగార్జున కు అభిప్రాయ బేధాలు వచ్చాయి.

తరువాత ఆ వివాదం సద్దుమణిగి పొయింది అనుకున్నారు అంతా. కాని నాగార్జున నటించే కొత్త సినిమా విడుదలకు ముందు ఈ వివాదాన్ని మళ్ళి తెరపైకి తీసుకువచ్చి నాగార్జున ను కార్నర్ చేద్దామని కొంతమంది రాజకీయ వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు అనే విషయం తెలియగానే ఎందుకైనా మంచిదని ముందు చూపు తో నాగ్ తన ‘భాయ్’ సినిమాను వాయిదా వేసుకున్నాడు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు గుప్పుమంతున్నాయ్. ఈ పరిస్థితులలో భారీ బడ్జెట్ తో నాగార్జున నిర్మించిన భాయ్ సినిమా విషయం పై నాగ్ కలవర పడుతున్నాడు అని ఫిల్మ్ నగర్ విశ్లేషకులు అంటున్నారు. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా భాయ్ సినిమా విడుదల వాయిదా పడడం చూస్తూ ఉంటే నాగ్ కలవరపడుతున్నట్లుగానే అనుకోవాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: