పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకు దారి ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియకపోయినా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్తతో మీడియా మాత్రం హడావుడి చేస్తూనే ఉంది. ఆగష్టు నెలాఖరుకు వస్తుంది అనుకున్న ఈ సినిమా ఆగష్టు గడచిపోవడంతో పవన్ అభిమానుల ఆశలు సెప్టెంబర్ నెలపై పడ్డాయి. లేటెస్ట్ వార్తల ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 20 న కాని లేకుంటే 27 న కాని విడుదల అవుతుంది అంటూ ఈ సినిమాకు సంబంధించి సరికొత్త డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉంటే పవన్ పవనిజాన్ని ట్రెండ్ సెట్టర్ గా తీసుకున్న పవర్ స్టార్ అభిమానులు ఈ సినిమా ఇప్పట్లో విడుదల కాకపోయినా తమ అభిమాన హీరో సినిమాను తాము వేసుకొనే టీ-షర్టు లలో చూసుకొని మురిసిపోతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సమైఖ్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాలు జరుగుతున్నా, ఈ ఉద్యమాలతో సంబంధం లేకుండా భాగ్యనగరంలో పవన్ ‘అత్తారింటికి దారేది’ టీ-షర్టు లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో వేసుకున్నట్లు గానే ఉండే ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీ-షర్టు పవర్ స్టార్ అత్తారింటికి దారేది టీ-షర్టు అంటూ చాలామంది రెడీ మేడ్ వ్యాపారులు తమ తమ షాప్ లలో పెట్టి పెద్ద ఎత్తున సేల్స్ చేస్తున్నారు. పవన్ అభిమానులు కూడా ఈ షర్టు లను చాలా మురిపంగా కొనుక్కుంటూ సినిమా రావడం ఆలస్యం అయినా అప్పటిదాకా తామే ఆరడుగుల బుల్లెట్ అనుకుంటూ పవన్ నామస్మరణతో హడావుడి చేస్తున్నారట.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే సమాఖ్య ఉద్యమ సేగలకు భయపడి ఆగిపోయిన ఈ సినిమా టీ-షర్టులకు మాత్రం  కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే రెడీమేడ్ షో రూమ్స్ లో కూడా మంచి డిమాండ్ తో సేల్స్ అవడం చూస్తూ ఉంటే ఉద్యమాలకు అతీతంగా రాష్ట్ర యువతరంలో పవన్ పట్ల పెరిగిపోతున్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతోంది. అందుకే పవన్ శబ్దం గాలిలో కూడా ఉంది అంటూ బన్నీ వాస్తవాన్ని బహిరంగానే ఒప్పుకున్నాడు. అత్తారింటికి దారేది సినిమాను కొనుక్కున్న బయ్యర్లు టెన్షన్ పడుతున్నా ఆ టీ-షర్ట్స్ అమ్ముతున్న రెడీమేడ్ వ్యాపారులు మంచి ఖుషిగా ఉండడం నేటి లేటెస్ట్ న్యూస్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: