సినిమా రంగంలో ఉన్న వారికి ఉన్నంత సెంటిమెంట్లు మరే రంగంలో ఉన్నవారికి ఉండవు. ఒక హీరో సినిమా పేరు మూడు అక్షారాలతో వచ్చి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఇక ఆ హీరో సినిమాలు అన్నీ అలా మూడు అక్షలారతోనే వస్తాయి. అలాగే దర్శకుడు, హీరోయిన్ ఇలా ప్రతీ విషయంలోనూ అదృష్టానికి సెంటిమెంట్ ను జత చేస్తూ రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటారు మన టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు. ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా చెప్పుకోడానికి సరైన హిట్ లేక బాధపడుతున్న హీరో నాగార్జున కు కూడా ఈ సెంటిమెంట్ పై గురి కుదిరింది అని వార్తలు వస్తున్నాయి.

నాగార్జున కెరియర్ ను ఒక మలుపు తిప్పిన ‘శివ’ సినిమా 1989 లో అక్టోబర్ 5 న విడుదల అయి తెలుగు సినిమా గతిని పూర్తిగా మార్చివేసి మరో లేటెస్ట్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. నాగ్ కెరియర్ లో బిగ్గెస్ట్ సూపర్ హిట్ మూవీ గా శివ ను పేర్కొంటారు. ఇది గతం. ప్రస్తుతం నాగార్జున డిఫరెంట్ గెటప్ లలో వీరభద్రం చౌదరి దర్శకత్వం లో నాగార్జున సొంతంగా తన అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మించిన ‘భాయ్’ అదే అక్టోబర్ 5 వ తారీఖున విడుదల చెయ్యడానికి నాగార్జున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే ‘భాయ్’ టీజర్ కు లక్షల సంఖ్యలో హిట్స్ రావడం తో మంచి జోష్ మీద ఉన్న నాగార్జున తన భాయ్ సినిమా ఆడియో ను ఇదే నెల మధ్యలో విడుదల చేస్తాడని అంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట చిత్రీకరణ ఈవారంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగ్, రిచా గంగోపాధ్యాయ లపై చిత్రీకరిస్తారని అంటున్నారు. ఈ సినిమాపై ఒక్క నాగార్జున యే కాకుండా హీరోయిన్ రిచా కూడా చాలా ఆశలు పెట్టుకుంది. మరి శివ సెంటిమెంట్ భాయ్ కి కలిసి వచ్చి నాగ్ ఎప్పటినుంచో కోరుకుంటున్న సూపర్ హిట్ వస్తుందో లేదో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: