నందమూరి సింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నా విషయం అందరికీ తెలిసిందే. క్రితం సంవత్సరం బాలయ్య తో కలిసి మోక్షజ్ఞ ‘శ్రీమన్నారాయణ’ ఆడియో వేడుకకు వచ్చి నందమూరి అభిమానులకు జోష్ కలిగించాడు. ప్రస్తుతం తన చదువు కొనసాగిస్తూనే మరొకవైపు టాలీవుడ్ హీరోగా సెటిల్ అవడానికి అవసరమైన నటనా, డాన్స్, ఫైట్స్ విషయాలలో కూడా మోక్షజ్ఞ తర్ఫీదు పొందుతున్నాడు. బాలయ్య ను యువరత్న అని, జూనియర్ ను యంగ్ టైగర్ అని నందమూరి అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అయితే వీరిద్దరికీ సినిమాలలోకి వచ్చిన తరువాత ఈ టైటిల్స్ వచ్చాయి.

కాని మోక్షజ్ఞ సినిమాలలోకి రాకముందే నందమూరి అభిమానుల చేత బిరుదులు కొట్టేశాడు. ఈరోజు మోక్షజ్ఞ జన్మదినోత్సవ సందర్భంగా అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రకటనలతో పాటు మోక్షజ్ఞ ను ‘యంగ్ లయన్’ గా అభివర్ణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పోస్టర్లు వెలవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఇంకా సినిమాలలోకి రాకుండానే సినిమా హీరో పబ్లిసిటీ ఈరోజు నుంచి మోక్షజ్ఞ కు మొదలు అయిపొయింది. నందమూరి బాలయ్య కు సన్నిహితులు అయిన వారి దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే సంవత్సరం మన రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తరువాత వెలువడుతుంది అని అంటున్నారు.

వచ్చే ఎన్నికలలో పోటీ చేసి పూర్తి స్థాయి రాజకీయాలలోకి వద్దాము అని బాలయ్య అనుకుంటున్న నేపధ్యంలో రాజకీయాలలో బాలకృష్ణ పూర్తిగా సెటిల్ అయిన తరువాత మాత్రమే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని అంటున్నారు. ఈలోపున అమెరికాలోని ఒక ప్రముఖ యాక్టింగ్ స్కూల్ కు మోక్షజ్ఞ ను పంపించి అన్ని విషయాలలోనూ ట్రైనింగ్ ఇప్పిదామనుకుంటున్నాడట బాలయ్య. వచ్చే సంవత్సరం నాగార్జున మరో నట వారసుడు అఖిల్ ఎంట్రీ ఖాయం అయిపొయింది కాబట్టి అన్నీ కుదిరితే 2015 లో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య వారసుడు కూడా రెడీ అవడమే కాకుండా అప్పుడే ‘యంగ్ లయన్’ అనే బిరుదు తో జనంలోకి వచ్చేస్తున్నాడు మోక్షజ్ఞ.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: