పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ‘అత్తారింటికి దారేది’ సినిమాకు సంబంధించిన ముఖ్య యూనిట్ మెంబర్ లతో నిన్న సమావేశం అయి ఈ సినిమా విడుదల తేదీల గురించి చర్చించాడు అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న సమైఖ్య ఉద్యమం ఎప్పటికి ముగుస్తుందో తెలియదు కాబట్టి ఈ సినిమాను ఈనెల 20 వ తారీఖున విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సూచనకు నిర్మాత ప్రసాద్ అంగీకరించినా కోస్తా జిల్లాలలో ఈ సినిమాను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు మాత్రం ఆర్టీసి బస్సులు రోడ్డు పై నడిచేదాకా ఈ సినిమాను విడుదల చెయ్యవద్దని నిర్మాత మరియు పవన్ కళ్యాణ్ ల పై తీవ్రంగా ఒత్తిడి చేశారని అంటున్నారు.

ప్రస్తుతం కోస్తా జిల్లాలలో సమ్మె చేస్తున్న ఎన్జీవో లతో పాటుగా ఆర్టీసి ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నారు. అందువల్ల కోస్తా జిల్లాలలో ఎక్కడా కూడా ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఎక్కడ ప్రజలు అక్కడే చిక్కుపడిపోతున్నారని అందువల్ల ఆర్టీసి బస్సులు కూడా నడవని నేటి ప్రస్తుత పరిస్థితులలో ఈ సినిమాను విడుదల చేస్తే తమకు చాలా నష్టాలు వస్తాయని, ఈ ఆర్టీసి సమ్మె ఈనెల 21 వ తారీఖున ముగిసిపోతుంది అని అంటున్నారు కాబట్టి అధికారికంగా ఆర్టీసి సమ్మె విరమణ ప్రకటన వచ్చిన తరువాత ఈనెల 26 న కాని లేకుంటే అక్టోబర్ లో కాని ఈ సినిమా ను విడుదల చెయ్యమని చెప్పి హీరో పవన్ ను, నిర్మాత ప్రసాద్ లను ఒప్పించారని సమాచారం. కాని పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికే మార్కెట్లో విపరీతమైన క్రేజ్ వచ్చిన ఈ సినిమా విడుదల ఆలస్యం అయ్యే కొద్ది మరింత నష్టాలు వస్తాయని కోస్తా జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు కు చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించినా ఆ బయ్యర్లు ఎవ్వరు పవన్ చెప్పిన మాటలకు అంగీకరించలేదని అంటున్నారు.

లేటెస్ట్ గా ముందుగా మూడు రోజులు మాత్రమే అని ప్రకటించిన ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సమ్మె నిరవధిక సమ్మెగా మారడం ఈ సినిమా విడుదల పై మరింత ప్రభావాన్ని చూపెడుతూ౦దని అంటున్నారు.  ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ అగమ్యగోచరంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ చేసేది ఏమీ లేక తన ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ స్క్రిప్ట్ కు, డైలాగ్స్ కు తుది మెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ సినిమా స్క్రిప్ట్ రచనలో పవన్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్నేహహస్తాన్ని అందిస్తున్నాడని టాక్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: