ప్రస్తుతం క్షణం తీరిక లేని రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉంటూ తనపై సీమంధ్ర ప్రజలకు ఏర్పడ్డ కోపానికి పరిహారంగా ఏమి చెయ్యలా అని ఆలోచిస్తూ రోజులను భారంగా గడుపుతున్న పొలిటికల్ మెగాస్టార్ చిరంజీవి కి ఇంత రాజకీయ హడావుడి లో కూడా ఒక సినిమా చూశారు. ఆ సినిమాను చూడడమే కాకుండా ఆ సినిమా కధలో లీనమై కంటకన్నీరు కూడా పెట్టుకున్నారు. చిరంజీవి ని అంతగా ప్రభావితం చేసి ఆయనను కరిగించిన ఆ సినిమా ‘మిణుగురులు’. అంగవైకల్యం ఉన్న వారిపై సానుభూతి చూపించకుండా వారిలో ఆత్మ విశ్వాసం పెంచాలి అనే ఉద్దేశంతో రూపొందించిన సినిమా మిణుగురులు. అయోధ్య కుమార్, కృష్ణం శెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా చాలా మంచి సినిమాగా అందరికీ నచ్చుతుంది అంటూ ఈ సినిమా ప్రివ్యూ ను చూసిన వారు అంటున్నారు.

ఈ సినిమాలో సుహాసిని ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా చూసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడతూ, ఇలాంటి మంచి సినిమాను తాను తియ్యలేనని, ధైర్యంతో ఆత్మ విశ్వాసంతో అయోధ్య కుమార్ చేస్తున్న ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 2010 లో ప్రారంభించిన ఈ సినిమాలో 40 మంది అంధబాలలు ప్రధాన పాత్ర దారులుగా నటించడం టాలీవుడ్ లో ఒక ప్రముఖ వార్తగా పేర్కొంటున్నారు. ఇలాంటి సినిమాలు మన దేశంలో కాకుండా అమెరికా లాంటి దేశాలలో నిర్మిస్తే విపరీతమైన ప్రచారం వస్తుంది. కాని ధైర్యం తో మంచి సినిమాను తీద్దామని ప్రయత్నిస్తున్న అయోధ్య కుమార్ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: