భలే టైం చూసుకుని ‘భాయ్’ వచ్చేస్తున్నాడు, పవన్, రాంచరణ్, ఎన్టీఆర్ ల దురదృష్టాన్ని నాగార్జున తన అదృష్టంగా మార్చుకుంటున్నాడు. వారి సినిమాలు విడుదల ఆగిపోతే ఆ అవకాశాన్ని తను వినియోగించుకోని ‘భాయ్’ తో బంపర్ హిట్టు కొడ్తానంటున్నాడు.

ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఆముగ్గురు హీరోలు పచ్చడి అవుతుంటే ఆ తాకిడి ఏమి లేని నాగార్జున తానే నిర్మాతగా, తనే హీరోగా తీసిన ‘భాయ్’ సినిమాను అక్టోబరు 4న విడుదల చేస్తున్నాడు. ఈ సినిమా ఆడియో ను ఈనెల 20న విడుదల చేస్తున్నాడు.

ఈ నెల 15లోపు షూటింగ్ పూర్తి చేసుకుని అంతే వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయనున్నారట. ఇప్పటికే సినిమా లోగో, పోస్టర్స్ అన్ని సిద్దం చేసారు.  రిచాగంగోపాద్యాయ హీరోయన్ గా ఈసినిమాలో నటించింది. పూలరంగడు ఫేం డైరెక్టర్ వీరభద్ర చౌదరి ‘భాయ్ ’ కి దర్శకత్వం వహిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: