సినిమా కెరీర్ మసకబారాక టెలివిజన్ రంగంలో అడుగు పెడుతుంటారు సినిమా వాళ్లు. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు... ఎవరికైనా సెకెండ్ లైఫ్ ఇవ్వడానికి టీవీ సిద్ధంగా ఉంటుంది. అందుకే ఇక్కడ హవా తగ్గినా అక్కడ కడుపు నింపుకోవచ్చులే అన్న ధైర్యం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఫామ్ లో ఉండగానే టీవీ వైపు అడుగులు వేశాడు దర్శకుడు క్రిష్. 

గమ్యం, వేదం సినిమాలు చూసిన తర్వాత క్రిష్ లో ఎంతమంచి కథకుడు ఉన్నాడో అందరికీ అర్థమైపోయింది. అందుకే అతగాడి సినిమా అంటే ఏదో వేరియేషన్ ఉంటుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు చాలామంది. అలాంటివాడు ఓ సీరియల్ కి కథ ఇస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి! అందుకే ఈటీవీ వాళ్లు అతడి కథను వెంటనే సీరియల్ గా తీసేశారు. అదే 'స్వాతి చినుకులు'. ఎప్పుడూ సెంటిమెంటుతో సాగుతూ ఉండే సీరియల్స్ కు విభిన్నంగా ఓ మంచి ప్రేమకథను ఇచ్చాడు క్రిష్.

తాజాగా దీని గురించి అడిగితే చాలా విషయాలు చెప్పాడు క్రిష్. అతడు చాలా కాలంటా టీవీని రెగ్యులర్ గా చూస్తున్నాడట. కొన్ని సీరియల్స్ కూడా ఫాలో అవుతాడట. సినిమాల మాదిరే టెలివిజన్ రంగం కూడా చాలెంజింగ్ గానే ఉంటుంది, ఇక్కడ కూడా ప్రతిభకే పెద్ద పీట, కాకపోతే పని చేసే విదానంలో కాస్త తేడా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. చూస్తుంటే మనోడికి సీరియల్స్ మీద మనసుకు బాగానే ఉన్నట్టుంది. కొంపదీసి ఆ రంగంలో కూడా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేయడం లేదు కదా! ఎలాగూ కమర్షియల్ సినిమాలు తీయడు. ఏవో సామాజిక విలువలున్న సినిమాలే తీస్తానంటాడు. అలాంటి సినిమాలు చేయడం రిస్కే. ఎంతకాలం ఉంటామో అన్న గ్యారంటీ అయితే ఉండదు. అందుకే పనిలో పనిగా ఇక్కడ కూడా పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నాడేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: