ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్తారింటికి దారేది లీక్డ్ మూవీపై టాలీవుడ్ పెద్దలు సైతం స్టన్ అయ్యారు. ఇది ఎవ‌రైనా ప‌బ్లిసిటి కోసం కావాల‌ని చేసిందా, లేకుంటే నిజంగానే వీడియో లీక్ అయిందా అనే కోణంలో ద‌ర్యాప్తు జ‌రుగుతుంది. అయితే టాలీవుడ్ పెద్దలు మాత్రం ఈ లీక్డ్ వీడియోను జీర్ణించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా నిర్మాత‌లు,హీరోలు పెద్ద ఎత్తున కంగారు ప‌డుతున్నారు. ప‌వ‌న్ లీక్డ్ మూవీపై టాలీవుడ్ పెద్దలు ఏవ‌రేవిధంగా స్పంధించారంటే...

బండ్ల గ‌ణేష్: ఓ టీవి ఛాన‌ల్‌లో మాట్లాడుతూ క‌న్నీరు పెట్టాడు. మాట్లాడ‌టానికే మాట‌లు రావ‌డంలేదు. ఇది చాలా ప‌నికిమాలిన ప‌ని. ఇలా జ‌రిగి ఉండ‌కుడ‌దు. ఉద‌యాన్నే నేను న్యూస్‌ను విన్నాను. అప్పటి నుండి కాసేప‌టి వర‌కూ అస‌లేం జ‌రుగుతందో అర్ధం కావ‌డంలేదు నాకు.

త‌మ్మారెడ్డి భ‌రద్వాజ‌: ఇటువంటి పైర‌సీ భూతాన్ని అరిక‌ట్టాలి. దాదాపు తొంభై నిముషాల నిడివి ఉన్న వీడియోను రిలీజ్ కంటే ముందుగానే బ‌య‌ట‌కు రావ‌డం అనేది దుర‌దృష్టక‌రం. వెంట‌నే వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలి

కె.య‌స్‌.రామారావు: పైర‌సీ భూతాన్ని అరిక్టక‌పోతే, ఇటువంటి దారుణ‌మై ప‌రిస్థితులు ఇంకా పెరిగిపోతుంటాయి. వెంట‌నే దీనికి సంబంధించిన చ‌ర్యల‌ను తీసుకొని వెంట‌నే అరికట్టాలి.

రాజ‌మౌళి: ఈ న్యూస్‌ను విన‌టానికే బాధ‌గా ఉంది. ద‌య‌చేసి పైర‌సీ లింక్‌ల‌ను ఎంక‌రేజ్ చేయ్యొద్దు. వెంట‌నే యాంటి పైర‌సీ సెల్‌కు స‌మాచారం ఇవ్వండి.

సుమంత్‌: ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన 90 నిముషాల వీడియో లీక్డ్ జ‌ర‌గ‌టం ఊహించ‌నది. ఇలాంటి వీడియో క‌న‌బ‌డితే వెంట‌నే యాంటి పైర‌సీ సెల్‌కు స‌మాచారం ఇవ్వండి.

హ‌రీష్‌శంక‌ర్‌: ప‌వ‌న్ లీక్డ్‌ మూవీను ఎట్టి ప‌రిస్థితుల్లో ఎంక‌రేజ్ చేయొద్దు. 

సీడీల పైరసీ పరంగా మీకు ఎలాంటి లింక్స్ అన్నా కనపడితే కింద ఇచ్చిన మెయిల్ కి రిపోర్ట్ చెయ్యండి.
legal@apfilmchamber.com or ad@apfilmchamber.com .

మరింత సమాచారం తెలుసుకోండి: