‘మెంటల్ కృష్ణ’ సినిమాలో హీరోగా నటించిన పోసాని, కొన్ని కొన్ని విషయాలపై కొద్దిగా ఆవేశంతో కూడిన మెంటల్ గానే మాట్లాడుతూ ఉంటాడు. అది ఆయన స్పెషాలిటీ. టాలీవుడ్ సినిమాలలో ఈయనకు క్రేజ్ ఏర్పడడానికి కారణం కూడా ఇదే అనుకోవచ్చు. సమైఖ్య ఉద్యమం సీమంధ్ర ప్రాంతంలో ప్రారంభం అయిన దగ్గర నుంచి కొన్ని చానల్స్ ఈ వార్తలకు చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ప్రసారం చెయ్యడమే కాకుండా అక్కడ జరుగుతున్న ఉద్యమాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో నిన్న ఒక ప్రముఖ ఛానల్ వచ్చే నెలలో విడుదల కాబోతున్న రెండు భారీ సినిమాల భవిష్యత్ పై చర్చా గోష్టి ని నిర్వహించి, ప్రస్తుతం వందేళ్ళ సినిమా ఉత్సవాలలో చెన్నై లో ఉన్న పోసాని కృష్ణ మురళి ని వీడియో కన్ఫరేన్స్ ద్వారా పోసాని అభిప్రాయాన్ని నేడు జరుగుతున్న సమైఖ్య ఉద్యమం పై అడిగింది. స్వతహాగా ఆవేశంగా మాట్లాడే పోసాని, ఆ చర్చాగోష్టి లో మరింత ఆవేశంగా మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ఉద్యమాలకు రాష్ట్రంలోని ప్రతి పార్టీ నాయకుడికి పాత్ర ఉంది అని అనడమే కాకుండా ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఓవర్ యాక్షన్ వల్ల రాష్ట్రం మరింత మండిపోతోందని, చంద్రబాబు పై తన విమర్శల బాణాలను వదిలాడు పోసాని.

అదే విధంగా పెద్ద సినిమాలు అయినా ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘ఎవడు’ సినిమాల గురించి మాట్లాడుతూ, పవన్, చెర్రీ లకు చిరంజీవి దురదృష్టంగా మారితే జూనియర్ కు చంద్రబాబు మరో దురదృష్టంగా మారాడని అంటూ వీరి నీడలలో ఈ హీరోలు ఉన్నంత కాలం భవిష్యత్ లో చరణ్, పవన్, జూనియర్ లకు చాలా సమస్యలు వస్తాయని తన సహజసిద్ధమైన ఆవేశంతో కామెంట్ చేశాడు పోసాని. మరి పోసాని చెప్పిన కామెంట్స్ ఎంత వరకు నిజం అవుతాయో మరి కొద్ది రోజులలో తేలిపోతోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: