‘అత్తారింటికి దారేది’ సినిమాకు సంబంధించిన 90 నిమిషాల విజువల్స్ ఎలా లీక్ అయ్యాయి అన్న విషయంపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించకపోయినా, అమెరికా దేశపు కాలిఫోర్నియా లోని ఫ్రీమాంట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐపి అడ్రస్ నుండి ఈ లీక్ వీడియో యూ-ట్యూబ్ లోకి అప్లోడ్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పైరసీ వ్యవహారాన్ని ఖండిస్తూ టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా తమ తమ స్థాయిలలో ఖండనలతో స్పందిస్తూ, పవన అత్తారింటికి దారేది సినిమా నిర్మాతలకు మానసికంగా వత్తాసు పలుకుతున్నారు. ప్రముఖ హీరోలు, సిద్ధార్ద్, మంచు మనోజ్, రామ్, నిఖిల్, సుమంత్ లు ఈ పైరసీ ని ఖండిస్తూ ఇప్పటికే తమ ట్విట్టర్ లలో తమ వ్యాఖ్యలు పొందుపరచారు.

అయితే ఎప్పుడూ  విభిన్నంగా ఆలోచించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ పైరసీ వ్యవహారాన్ని కొత్త కోణంలో చూస్తూ, కొత్త తరహాగా ట్విట్ చేశాడు. ఈ వ్యవహారంపై ఆయన ప్రతిస్పందన వర్మ మాటలలోనే చూడండి. “విషాదం ఏమిటంటే, అత్తారింటికి దారేది పైరసీ ని ఖండిస్తూ ఆందోళన చేస్తున్న సెలబ్రిటీల నుంచి పవన్ అభిమానుల దాకా ఈ సినిమా ఆన్ లైన్ లో ఎక్కడైనా దొరుకుతుందేమో అని శక్తి మేరకు ప్రయత్నిస్తున్నారు” అంటూ విచిత్రమైన ట్విట్ చేసి అవినీతిని, చెడుని వ్యతిరేకించే గొప్పవాళ్ళ దగ్గర నుంచి సామాన్యుల వరకూ ఆ అవినీతి, చెడుల పట్ల ఆకర్షణతో వాటివంకే చూస్తూ ఆ వార్తలనే తెలుసుకుంటూ తమ విలువైన కాలాన్ని మనుషులు వృధా చేసుకుంటున్నారు అనే కొత్త కోణం రామ్ గోపాల్ వర్మ ట్విట్ లో కనిపిస్తోంది. జీవితంలో ఎన్నో విషయాలను చూసిన వర్మ వేదాంతి లా ఈ అత్తారింటికి దారేది పైరసీ పై ఇలా విభిన్నంగా స్పందించడం ఆయనకే చెల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: