అత్తారింటికిదారేది లీక్డ్ మూవీ ఇంటి దొంగ బాగోతమేన‌ని పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ కేసులో ఎక్కువుగా వినిపిస్తున్నది ప్రొడ‌క్షన్ అసిస్టెంట్ అరుణ్ పేరు. మ‌రి పోలీసు పేరు ఏమైన‌ట్టో ఎవ‌రికి తెలీదు. దీనికి సంబంధిన డిటైల్స్‌పై టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. మూవీను తీసుకుపోయేవాడు కేవ‌లం ఎన‌బై నిముషాల మూవీనే ఎలా తీసుకువెళ‌తాడు. డివిడిలో పూర్తి మూవీ ఉంటుంది క‌దా అంటూ కొంత మంది దొంగ‌త‌నం తీరుపై అనుమానాలు లేవ‌నెత్తుతున్నారు. ప‌బ్లిసిటి స్టంట్ కోసమే ఈ విధ‌మైన జిమ్మిక్కులు చేసి, ఆ కేసు మ‌మ అని అనిపించి క్లోజ్ చేయించి ఉంటార‌ని కొంద‌రు అంటున్నారు.

అరుణ్ డి.వి.డి తీసుకోవ‌డం, దానిని పోలీస్‌కి అందించడం త‌రువాత ఇంట‌ర్నెట్‌లోనూ, షాపుల్లోనూ ద‌ర్శన‌మివ్వడం అనేది ఒక్కరాత్రిలో జ‌రిగే విష‌యం కాదు. దీనికి ముందు నుండే ఎంతో ప్రిప్లాన్డ్ తతంగం ఉందందంటున్నారు కొంద‌రు. కేవ‌లం ఒక్కరినే దొషి చేసి, కేసును రాంగ్ ట్రాక్‌లో తీసుకువెళ్ళడం జ‌రుగుతుంద‌ని టాలీవుడ్ చెబుతున్న మాట‌. కాని లీక్డ్ వీడియోపై టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఎన్నో విష‌యాలు నేర్చుకుంది. పొస్ట్ ప్రొడ‌క్షన్ రూంలో జ‌రిగే త‌తంగం నుండి మ్యూజిక్ డైరెక్టర్ వ‌ద్ద జ‌ర‌గే రీరికార్డింగ్ స్టూడియో వ‌ర‌కూ ఎన్నో జాగ్రత్తల‌ను తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: