గతవారం అంతా దసరా పండుగ వార్ అంతా జూనియర్, పవన్ ల మధ్యే ఉంటుంది అనుకున్నారు అంతా. కాని మొన్నటి నుంచి పైరసీ ట్విస్ట్ తో అత్తారింటికి దారేది తన దారి మార్చుకొని అక్టోబర్ కన్నా ముందుగానే ఈవారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ధియేటర్ లలో సందడి చెయ్యబోతోంది. దీనితో దసరా హడావుడి అంతా మన బుడ్డోడి దే అని యంగ్ టైగర్ అభిమానులు ఆనంద పడడమే కాకుండా మూడు సంవత్సరాల క్రితం బృందావనం తో కలిసివచ్చిన దసరా లా ఈ దసరా కూడా రామయ్యా వస్తావయ్యా కు పండుగ కిక్ ఇస్తుంది అనుకున్నారు అంతా.

అయితే అనుకోకుండా ఒక అడుగు వెనుకకు వేసిన వెండితెర మన్మధుడు నాగార్జున వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకువస్తూ దసరా పోటీకి తాను కూడా రెడీ అంటూ సంకేతాలు ఇస్తూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భాయ్’ ఆడియో వేడుకను అక్టోబర్ 1వ తారీఖున నిర్వహించడమే కాకుండా మొదటిగా పవన్ అత్తారింటికి దారేది విడుదల అవుతుంది అనుకున్న అక్టోబర్ 9న కాని లేదంటే విజయదశమి పండుగ రోజైన అక్టోబర్ 14 న కాని ‘భాయ్’ ని విడుదల చెయ్యడానికి ప్లాన్ సిద్ధ౦  చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. పండుగ రేసు నుండి పవన్ సినిమా తప్పుకోవడంతో జూనియర్ తన రామయ్యా వస్తావయ్యా కు భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశపడుతున్నాడు.

ఈ నేపధ్యంలో నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ తో జూనియర్ ఆశలకు నీళ్ళు జల్లినట్లే అనే వార్తలు ఫిల్మ్ నగర్ లో వినిపించడమే కాకుండా పవన్, జూనియర్ ల మధ్య జరుగుతుంది అనుకున్న పోటీ జూనియర్, నాగ్ ల మధ్య పోటీగా మారింది అంటూ ఫిల్మ్ నగర్ లో సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఏదో ఒక పెద్ద హీరోతో పోటీ ఎన్టీఆర్ కు తప్పకపోవడం ఈసారి దసరా ట్విస్ట్ అని అనుకోవాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: