ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ కొన్ని గంటల క్రితం విడుదల అయి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా సూపర్ హిట్ రేంజ్ కి వెళ్ళిపోయే సినిమా అంటూ పవన్ అభిమానుల హడావుడి తో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయిన ధియేటర్స్ అన్నీ దద్దరిల్లిపోతున్నాయి. విజయవాడ, తిరుపతి, తెలంగాణా ప్రాంతానికి గుండెకాయ అయిన హైదరాబాద్ లో పవన్ అభిమానులు అంతా ధియేటర్ ముందు ఉన్న పవన్ కటౌట్ లకు పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని ఆనందాన్ని చాటుకుంటున్నారు. గత 60 రోజులుగా సీమాంధ్ర లో జరుగుతున్న సమైఖ్య ఉద్యమ సెగల వేడి కూడా ఈ సినిమాను ఏమి చెయ్యలేకపొయింది.

విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో అక్కడ అక్కడ కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా ప్రదర్శనకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఆ సమస్యలు పవనిజం శక్తి ముందు ఆగలేకపోయాయి. ఇక మార్నింగ్ షో చూసిన అభిమానులు అయితే పవన్ మార్క్ ఎంటర్ టైన్మెంట్ కు ఈ సినిమా చిరునామా అంటూ పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్ లో పవన్ ఇమోషనల్ నటన చూసిన వారంతా పవన్ కళ్యాణ్ విశ్వరూపం ఈ సినిమాలో కనిపించింది అని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండూ బాగా ఉండడంతో ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ గా అత్తారింటికి దారేది మిగిలిపోతుందని రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న మార్నింగ్ షో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: