సామాన్యంగా ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమాలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్ కు విపరీతమైన పేరు వస్తుంది. కాని మొన్న శుక్రువారం విడుదల అయిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన సమంత కంటే సెకండ్ హీరోయిన్ గా నటించిన ప్రణిత కు విమర్శకులు ఎక్కువ మార్కులు వేస్తున్నారు. సమంత పాత్ర కేవలం తన అందాలకు మాత్రమే పరిమితం అయిపోతే ప్రణీత నటించిన పాత్ర చిన్నది అయినా నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో ఆ పాత్ర పరిధిమేరకు ప్రణీత చాలా చక్కగా నటించిందని విశ్లేషకులు అంటున్నారు.

అంతేకాకుండా ఈ సినిమాలో సమంతతో పోలిస్తే ప్రణీత చాలా ఫ్రెష్ గా కనిపించింది అనే మాటలు కూడా వస్తున్నాయి. అత్తారింటికి దారేది సూపర్ హిట్ తో ఇప్పటిదాకా గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరుగాంచిన సమంత డైమండ్ లెగ్ హీరోయిన్ గా మారిపొయినా, తన ఐరన్ లెగ్ సెంటిమెంట్ నుండి పవనిజం మాయతో బయటకు వచ్చిన ప్రణీత కు భవిష్యత్ లో టాలీవుడ్ లో చాలా మంచి అవకాశాలు వస్తాయి అని అంటున్నారు. సమంత క్రేజ్ ముందు కన్నడ బ్యూటీ ప్రణీత క్రేజ్ చాలా తక్కువగా ఉన్నా ప్రణీత నటనను సమంత నటనతో పోలుస్తూ విమర్శకులు ప్రణీత కు ఎక్కువ మార్కులు వేయడం ఓ విధంగా సమంత కు షాకింగ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. భవిష్యత్ లో ప్రణీత కు ఇలాంటి మంచి అవకాశాలు ఇంకా ఎన్ని వస్తాయో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: