అమాయకంగా కనిపించే మాయలేడి సమంత గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక విచిత్రమైన కామెంట్ చేసాడు. చాలామంది తనను పంచ్ డైలాగ్ స్పెషలిస్ట్ అని అంటారు, కానీ సమంత షూటింగ్ మధ్యలో యూనిట్ సభ్యులతో వేసే సెటైర్ల ముందు తన సెటైర్లు సరిపోవని త్రివిక్రమ్ అన్నారు. అత్తారింటికి దారేది సినిమా సక్సస్స్ సందర్భంగా రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ సమంత గురించి చాలా విషయాలు చెప్పాడు.

సినిమాలో నటిస్తున్న యూనిట్ మెంబర్స్ పై సమంత వేసే సేటైర్లకు మైండ్ బ్లాంక్ అవుతుందని అంటూ, తెలుగు భాష సరిగ్గా రాకపోయినా వచ్చీ రాని తెలుగు పదాలతో సమంత హీరో దగ్గర నుంచి లైట్ బాయ్ వరకూ తన మాటలతో టార్గెట్ చేస్తూ నవ్విస్తూ ఉంటుందని చెపుతూ, అత్తారింటి సినిమాలో పవన్ పక్కన నుంచుని ఒక డైలాగ్ చెప్పమని తాను అంటే సమంత ఆ డైలాగ్ ను పవన్ పక్కన నుంచుని చెప్పేసి తిరిగి పవన్ ఒళ్లో కూర్చుందని, ఈ సీన్ ఏదో బాగుందని తాను భావించి ఆ సీన్ ను కూడా షూట్ చేశానని చెపుతూ, సమంత తెలివితేటలను, సెటైర్లను తట్టుకోవాలి అంటే అవతల వ్యక్తికి కూడా చాలా మంచి తెలివితేటలు ఉండాలని లేకుంటే సమంత ముందు పూర్తిగా ఓడిపోతారని సమంత తెలివితేటలను మన మాటల మాంత్రికుడు ఆ లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రాం లో చెపుతూ ఉంటే మన క్యూట్ బేబీ సమంత ‘మీరెంటండి బాబూ నా గురించి ఇలా చెప్పేస్తున్నారు, ఇది లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రాం’ అంటూ త్రివిక్రమ్ మాటలకు అడ్డు తగిలింది.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే, సామాన్యంగా పవన్ తన సినిమాలలో నటించిన ఏ హీరోయిన్ ను పెద్ద గా పొగడడు. కాని అటువంటి పవర్ స్టార్ చేత పొగడ్తలు రప్పించుకుంది కాబట్టే మీడియా వర్గాలలో చాలామంది మన క్యూట్ హీరోయిన్ ను మాయలేడి అంటూ ముద్దుగా పిలుస్తారు. మరి ఈ మాయలేడిని సిద్ధార్ద్ భవిష్యత్ లో ఎలా తట్టుకుంటాడో చూడాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: