టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటిదాకా ఓవర్సీస్ రికార్డులకు కింగ్. ఓవర్సీస్ లో మహేష్ హవా ‘దూకుడు’ సినిమా నుంచి మొదలై దూకుడు రికార్డులను ‘సీతమ్మ వాకిట్లో’ తిరగ రాసింది. మధ్యలో వచ్చిన ‘ఈగ’, ‘గబ్బర్ సింగ్’, ‘బాదుషా’ సినిమాలకు ఓవర్సీస్ కలెక్షన్స్ బాగా వచ్చినా అవి మహేష్ ఓవర్సీస్ రికార్డుల ముందు నిలబడలేకపోయాయి. కానీ గతవారం విడుదలైన పవన్ అత్తారిల్లు ఓవర్సీస్ లో మహేష్ బాబు రికార్డులను తిరగ రాస్తూ గత నాలుగు రోజులుగా ఈ సినిమాకు వస్తున్న డాలర్ల వర్షం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీకెండ్ అయిపోయిన తరువాత కూడా ‘అత్తారిల్లు’ సినిమాకు అమెరికాలో వస్తున్న కలెక్షన్స్ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

నడుస్తున్న క్రేజ్ ను బట్టి చూస్తూ ఉంటే పవన్ అత్తారిల్లు అమెరికాలో క్రియేట్ చేస్తున్న కలెక్షన్స్ తుఫాన్ ఇప్పట్లో మరో హీరో బ్రేక్ చేసే అవకాశం కనిపించడం లేదు అని అంటున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్తరిల్లు సినిమాను నడిపించడంలో అతడి స్థాయికి తగ్గట్టుగా దర్శకత్వం చెయ్యలేకపోయాడు అని ఓవర్ సిస్ ప్రేక్షకులలో మాటలు వినిపిస్తున్నా, ఈ సినిమా అంతా అన్నింటా తానై పవన్ నటించిన తీరు, పవన్ పలికిన పంచ్ డైలాగ్స్ క్రేజ్ తో ఈ సినిమా ఓవర్ సిస్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలబడబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇక సమీపంలో ఈ సినిమాకు పోటీగా జూనియర్ ‘రామయ్యా వస్తావయ్యా’ విడుదల కాబోతున్న పవనిజం క్రేజ్ ముందు ఓవర్ సీస్ ప్రేక్షకుల ముందు రామయ్యా వస్తావయ్యా సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా నిలబడటం కష్టం అని అంటున్నారు. ఇక అత్తారింటి రికార్డు లను తిరగరాయగల సత్తా మహేష్ బాబు నటిస్తున్న ‘వన్’ నేనొక్కడినే సినిమాకు ఉన్నా సుకుమార్ దర్శకత్వంలో  హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గా రూపొందుతోంది అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో మహేష్ బాబు ‘వన్’ మూవీ కీ పవన్ అత్తరింతికి దారేది ఓవర్ సీస్ రికార్డు లను బ్రేక్ చేసే అవకాశం లేదు అని అంటున్నారు విశ్లేషకులు.

దీనికి ప్రధాన కారణం వన్ మూవీ లో కామెడీ ఎలిమెంట్ చాలా తక్కువ అనే వార్తలు వస్తున్నాయి. ఓవర్ సీస్ ప్రేక్షకులు కామెడీ ఎలిమెంట్ లేని సినిమాలను అవి ఎంత పెద్ద హీరోల సినిమాలనైనా గతంలో ఆదరించిన సందర్భాలు లేవు. ఈ కారణం రిత్యా మహేష్ కు ఉన్న క్రేజ్ రిత్యా వన్ మూవీ కీ పాజిటీవ్ టాక్ వచ్చినా పవన్ అత్తారింటి ఓవర్ సీస్ రికార్డుల దరికి వెళ్ళలేదు అని అంటున్నారు. అదీ కాకుండా సినిమా ప్రారంభం అయిన దగ్గర నుంచి పవన్ అత్తారింటికి వచ్చిన పాజిటీవ్ టాక్ కూడా పవన్ సినిమాకు అదృష్టంగా మారింది అని అంటున్నారు విశ్లేషకులు. ఈ కారణాల రిత్యా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోతున్న ప్రిన్స్ మహేష్ వన్ సినిమా ఎంత వరకూ పవన్ అత్తారింటికి ఓవర్ సీస్ రికార్డు లను బ్రేక్ చేస్తుంది అనే విషయం పై అప్పుడే రకరకాల లెక్కలను మన టాలీవుడ్ పండితులు వేసేస్తున్నారు. ఈ అంచనాలకు మహేష్ ఎటువంటి సమాధానం ఇస్తాడో తెలియాలి అంటే వచ్చే సంక్రాంతి దాకా ఆగాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: