మీడియా అత్యుత్సహం కారణంగా కొంమంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. వారి వ్యక్తిగత జీవితం ఇబ్బందుల పాలవుతోంది. ఏకంగా వారిపై వ్యభిచారిణుల ముద్ర పడుతోంది. దీంతో తట్టుకోలేని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఎవరో చేసిన పొరపాటుకు వారు ఇబ్బంది పడుతున్నారిప్పుడు. 
 హైటెక్ సిటీ ఏరియాలో రెండు రోజుల క్రితం వ్యవభిచారం కేసులో బండారు శ్రావణి అనే అమ్మాయి దొరికింది. వ్యభిచారంలో పట్టుబడింది ఆమె.  అయితే ఎవరో టీవీ ఆర్టిస్టు శ్రావణి వ్యభిచారంలో దొరికింది అనగానే.. గూగుల్ సెర్చిలో 'టీవీ ఆర్టిస్ట్ శ్రావణి' అనే పేరుతో వచ్చిన రిజల్ట్స్లో అమ్మాయి పోటోను వాడేసుకున్నారు మీడియా వాళ్లు. ఇంకేముంది.. ఆ ఫోటోలతో ఆ ఆర్టిస్టులకు ప్రాణం పోయినంత పని అయ్యింది. ఇంటా బయట తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. 
ఇలా ఒకరు కాదు.. మొత్తం ముగ్గుర శ్రావణిల ఫోటోలు ప్రచారంలోకి వచ్చాయి. వారు ముగ్గరూ కూడా పట్టుబడిన శ్రావణిలు కాదు! దీంతో వివరణ ఇచ్చుకోవడానికి మీడియా హౌస్ ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. నేరం చేసింది మేము కాదు అని వారు చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ విదంగా తప్పు చేసింది ఒకరైతే ఇప్పుడు ఇబ్బంది  పడుతున్నది వేరేవాళ్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: