కోళీవుడ్ ఇండ‌స్ట్రీలో మ‌రో ఖుష్బు అంటూ ప్రచారం జ‌రుగుతున్న హీరోయిన్‌ హ‌న్సిక‌. హ‌న్సిక త‌న అందాల‌తో కోళీవుడ్ ప్రేక్షకుల‌నే కాకుండా, టాలీవుడ్ ప్రేక్షకుల‌నూ మాయ చేస్తుంది. హ‌న్సిక ఎప్పుడూ మీడియాలో ఏదో ఒక టాపిక్‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. హ‌న్సిగా క్యూట్‌గా ఉంటుంది క‌దా అని ఎవ‌రైనా మోసం చేయాల‌ని చూశారంటే, ఇక వారి ప‌ని అయిపోన‌ట్టే. హ‌న్సిక ఇదే విష‌యాన్ని లేటెస్ట్‌గా ఓ నిర్మాత‌కు చూపించింది.

హన్సిక,నితిన్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ ‘సీతారాములకళ్యాణం.. లంకలో’ అనే సినిమాను ఇప్పుడు త‌మిళ్‌లో ‘రౌడీ కొట్టై’ పేరుతొ రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డ‌బ్బింగ్ రైట్స్‌ను కోళీవుడ్ ఇండ‌స్ట్రీకు చెందిన ఓ నిర్మాత తీసుకున్నాడు. కోళీవుడ్‌లో నితిన్ అంటే అంత‌గా ప‌ట్టించుకోరు కాబ‌ట్టి, ఆ నిర్మాత మూవీ ప‌బ్లిసిటికోసం హ‌న్సికను తెగ వాడుకుంటున్నాడు. ఈ విష‌యం తెలుసుకున్న హ‌న్సిక స‌ద‌రు నిర్మాత‌పై కేసు పెట్టింది.

'నేను ఆ మూవీను తెలుగు లాంగ్వేజ్‌కి మాత్రమే సైన్ చేశారు. దానిని మ‌రో భాష‌లో రిలీజ్ చేయాలంటే నా ప‌ర్మిష‌న్ కావాలి. అలా కాకుండా మూవీను ఎలా కొంటారు ? ఏ విధంగా రిలీజ్ చేస్తారు ?' అంటూ ఆ నిర్మాత‌పై లీగ‌ల్‌గా ఫైట్ చేస్తుంది. 'నాకు స‌రైన న్యాయం జ‌ర‌గందే ఆ మూవీను రిలీజ్ చేస్తే ఊరుకునేది లేదంటూ' విరుచుకుప‌డుతుంది. ఈ విష‌యంలో హ‌న్సిక‌కు తోడుగా, హ‌న్సిక‌ త‌ల్లి ఉంది. అయితే నిర్మాత మాత్రం 'వీళ్ళకు భ‌య‌ప‌డేది లేదు. మూవీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. లీగ‌ల్‌గా న‌న్ను ఏమి చేయ‌లేదు. మూవీ ఖ‌చ్చితంగా రిలీజ్ అయి తీరుతుందని' అంటూ దానికి సంబంధించిన ప‌నుల్లో బిజి అయ్యాడు. హ‌న్సిక‌, నిర్మాత మ‌ధ్య జ‌రుగుతున్న ఈ వార్ ఎంత వ‌ర‌కూ వెళుతుందో అని అంద‌రూ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: