నడక కలిసిన నవరాత్రి అంటూ చిరంజీవితో ఆమె వేసిన స్టెప్పులు ఎవరూ మర్చిపోలేరు. దాదాపు టాప్ హీరోలందరి సరసనా నటించిన ఆ సెక్సీ క్వీన్ పెళ్లి చేసుకోబోతోందని తెలిసి కుర్రకారు బెంగపడ్డారు. అంతగా తన అందాలతో అందరినీ అలరించిన ఆమె... రంభ. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ గ్లామరస్ నటి సెకెండ్ ఇన్నింగ్స్ కు సిద్దమయ్యింది.

 పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లి కూడా అయిన రంభ... ఇన్నాళ్లూ సినిమాలకు దూరంగానే ఉండిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి సినిమాల్లో మెరవడానికి రెడీ అవుతోంది. ఆల్రెడీ ఓ తమిళ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే హీరోయిన్ గా కాదు. హీరోకి అక్కగా. శింబు హీరోగా నటిస్తోన్న చిత్రంలో అతడికి అక్కగా నటించనుంది రంభ. అయితే రంభకు ఆమె భర్తకు గొడవలు వచ్చాయని, విడిపోయే పరిస్థితి వచ్చిందని, అందుకే ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తానని అంటోందని సమాచారం. కానీ రంభ మాత్రం ఈ కామెంట్లను కొట్టి పారేస్తోంది. మేమిద్దరం హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాం, ఇలాంటి పుకార్లు పుట్టించకండి అంటూ రుసరుసలాడుతోంది.

 అయినా రీ ఎంట్రీ ఇవ్వాలంటే భర్త నుంచి విడిపోవాలా ఏంటి! ఎంతమంది నటీమణులు హాయిగా కాపురాలు చేసుకుంటూనే మళ్లీ నటించలేదు! రంభ కూడా అలానే వస్తోందేమో. మళ్లీ ఆమెని చూసి ఆనందించకుండా లేనిపోని లాజిక్కులు లాగడం ఎందుకట!

మరింత సమాచారం తెలుసుకోండి: