ఎడాపెడా తగులుతున్న దెబ్బలతో జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బందుల్లో పడ్డాడని అంటున్నారు ఆయన సన్నిహితులు. గత కొంత కాలంగా ఆయనకు సినిమా రంగంతో పాటు, రాజకీయ రంగం కూడా కలిసి రావడం లేదు, పైగా కుటుంబంలో కూడా ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కుంటున్నాడట.

ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయనకు ప్రాణమే సినిమాలు, అలాంటి సినిమా రంగం వరుసగా దెబ్బ తీస్తోందంటున్నారు. దమ్ము అలా ఫెయిల్ కాగా, తాజాగా రామయ్యా వస్తావయ్యా కూడా ఫెయిల్ టాక్ నే తెచ్చుకునే తోటి హీరోల ముందు లెవల్ పడిపోగా స్టార్ డమ్ కు కూడా కాస్తా దెబ్బ తగిలిందనే అభిప్రాయమే ఆయనతో పాటు సన్నిహితుల్లో కూడా నెలకొందంటున్నారు.

ఇక రాజకీయాల్లో మామయ్య చంద్రబాబు 2009లో ప్రచారంలో ఉపయోగించుకుని, ఇప్పుడు కుమారుడు లోకేష్ కోసం ఎన్టీఆర్ ను ఓతన్ను తన్నినంత పనిచేసాడు అంటున్నారు. మరో వైపు తండ్రి హరిక్రిష్ణను కూడా టిడిపి దూరం చేసింది. ఇక బాలక్రిష్ణ కూడా తనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ఎన్టీఆర్ ను పాతరేసే పనిలోనే ఉన్నాడంటున్నారు.

అంతెందుకు కూతురు పెళ్లికి ఎన్టీఆర్ ను బాలక్రిష్ణ పిలకవకపోవడం బట్టి చూస్తే ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబసభ్యులు కూడా దూరంగా ఉంచుతున్నారన్న అభిప్రాయం అందరిలో కలుగుతోంది. ఫ్లెక్సీల విషయంలో కూడా బాలక్రిష్ణ డైరెక్టుగా జూనియర్ పై విరుచుకు పడ్డాడు. ఇలా సినిమాల్లో ఫెయిలవుతూ, నిజ జీవితంలోను ఎదురు దెబ్బలకు లోనవుతూ ఎన్టీఆర్ తెగ ఇబ్బందుల్లో పడ్డాడు అంటున్నారు పరిశీలకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: