పవన్ కళ్యాణ్ కంటే నేనే బెటర్ అంటోందట నయనతార, టాలీవుడ్ చరిత్రనే తిరగరాసిన పవర్ స్టార్ కంటే ఓ హీరోయిన్ బెటర్ అంటోందంటే నిజంగా సంచలనమే కదా, కారణం టాలీవుడ్ లోని టాప్ హీరోలంతా పవన్ కంటే బెటర్ అనిపించుకోవడానికి చెమటలు పోసుకుంటున్న సమయమిది.

కాని నయనతార మాత్రం నేను పవన్ కంటే ఎంతో బెటర్ అంటోంది. పవన్ సెప్టెంబరు 27న ‘అత్తారింటికి దారేది’ సినిమాను భారీ అంచనాల మద్య విడుదల చేసి టాలీవుడ్ కలెక్షన్లలో 73 కోట్లు దాటించి నా అంత బెటర్ ఎవరు లేరు అంటూ నిరూపించుకున్నాడు. కాని నయనతార ఎలాంటి అంచనాలు లేకుండా సాదా సీదాగా అదే రోజు అంటే సెప్టెంబరు 27న తమిళంలో ‘రాజారాణి’ సినిమా విడుదల చేసి కలెక్షన్ల తూఫాను సృష్టిస్తోంది అంటున్నారు.

రాజారాణి తొలి 25 రోజుల్లో ఏకంగా 50 కోట్లు కలెక్షన్లు సాదించి 2013 గ్రాస్ కలెక్షన్ల సినిమాలలో మూడో స్థానంలో నిలిచింది. అంతే కాదు మొదటి వారాంతంలో ఏకంగా 12.2 కోట్లు కలెక్షన్లు సంపాదించి ఈ రికార్డులో నాలుగో స్థానంలో నిలచింది. అంతే కాదు ఓవర్సీస్ వసూళ్లు విషయంలో ఇంటర్నేషనల్ బాక్సాఫీసు వద్ద ఇప్పటికే 8,00,000 USD వసూళ్లు సాధించింది. పవన్ అత్తారింటికి దారేది కంటే ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలయిన సాధారణ సినిమాతో ఓ హీరోయిన్ ఇంత కలెక్షన్లు సాదించిందంటే ఆయన కంటే కాస్తా బెటర్ అన్నట్టే కదా... అన్నది టాలీవుడ్ వర్గాల అభిప్రాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: