పవన్ కు టాలీవుడ్ హీరోలకు ఎవరికి అంతగా లేని ఓ అలవాటు ఉంది, అదే బుక్ రీడింగ్, ఈ విషయాన్ని పవన్ ఎన్నోసార్లు చెప్పాడు. అంతే కాదు తన మాటల్లో, ప్రసంగాల్లో తన హాబీకి సంబందించిన బుక్ రీడింగ్ ఎక్స్ పీరియన్స్ ను ప్రదర్శిస్తుంటాడు పవన్ కళ్యాణ్.

తాజాగా అత్తారింటికి దారేది సినిమా కృతజ్ఞతలు తెలిపే సభలో ఆయన తన సినిమా పైరసీ గూర్చి మాట్లాడుతూ ‘This is not piracy, this is conspiracy’ అన్నాడు. ఇది శ్రీ బాలగంగాధర్ తిలక్ రాసిన బుక్ లోనిది.

తాజాగా తనకో పద్యం నచ్చిందంటూ అది చదివి వినిపించాడు. అదేంటంటే

ఇల్లేమో దూరం,
దారంతా గతుకుల మయం,
అసలే చీకటి,
చేతిలో దీపం లేదు,
కాని నాధైర్యమే నాకవచం.

ఇది కూడా తిలక్ రాసిన ‘అమృతం కురిసిన రాత్రి’ అనే బుక్ లోని నీడలు శీర్శికన 138 వ పేజిలోనిది అని చెప్పాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: