వపన్ ఒక్క దెబ్బతో సినిమా, రాజకీయ వర్గాలను చంపేసినంత పని చేసాడు అంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తాడు అని ఆశలు పెట్టుకున్న వారందరు ఒక్క సారిగా ఆయన నాగబాబుతో చేయించిన ప్రకటనతో హతాషులయ్యారు. వన్ పై ఎన్నో ఆశలను పెట్టుకుని గుళ్లు గోపురాలు తిరిగి పూజలు చేసాడు ప్రముఖ నిర్మాత రాంగోపాల్ వర్మ. పవర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలి, రాష్ట్రాన్ని మార్చేయాలి అంటూ ఎన్నో కలలు కన్నాడు. పాపం వర్మ పెట్టుకున్న ఈ ఆశలన్నింటిని పవన్ కళ్యాన్ చిదిమేసాడు అంటూ టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాంగోపాల్ వర్మనే కాదు, పవన్ పై ఆశలు పెట్టుకున్న టిడిపి నేతలను కూడా నాగబాబు ప్రకటన తుస్సు మనిపించింది. పవన్ టిడిపిలోకి వస్తున్నాడంటూ వెలసిన ఫ్లెక్సీలతో టిడిపి కొంత పండగ చేసుకుంటున్నట్టే కనిపించింది. అంతేనా ఓ అడుగు ముందుకేసి టిడిపి సీనియర్ లీడర్లు, మాజి మంత్రులు ఎందరో మెగాబ్రదర్స్ టిడిపి లోకి వస్తే అంతకంటే బలం మాకేం ఉంటుందన్నారు.

అయితే తమకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలేదు, మావృత్తిలో మేం బిజీ అనే సరికి పవన్ కొత్త పార్టీ పెడతాడు అని  రాంగోపాల్ వర్మ కలలు కల్లలు కాగా, అసలే కష్టకాలంలో ఉన్న టిడిపి సీమాంద్రలో ఊపిరి పోసుకుంటుందని ఆశపడ్డ తెలుగుదేశం వారి ఆశలు కూడా అడియాసలయ్యాయి. అయితే ఈ ప్రకటన నాగబాబు ఇవ్వడం, పవన్ ఇంకా స్పందించక పోవడంతో ఇంకా ఏవో ఆశలు మాత్రం వారిలో ఉన్నాయి, కంప్లీట్ ఖతం కాలేదు అంటున్న వారు కూడా ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: