వావ్... పవన్ కళ్యాణ్ రికార్డును ప్రభాస్ బద్దలు చేసాడు, నిన్నటి దాకా పవన్ ‘అత్తారింటికి దారేది’ సృష్టించిన రికార్డులను ఇప్పట్లో ఏ సినిమా కూడా అందుకోలేదు అని భావిస్తున్న తరుణంలో ప్రభాస్ తన తడాఖా చూపడం విశేషం. దీంతో అత్తారింటికి దారేది రికార్డులు ఎక్కువ కాలం ఉండబోవన్న సంకేతాలు జారీ అయ్యాయి అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రభాస్ తన పుట్టిన రోజు సంధర్భంగా ‘బాహుబలి’ ఫస్ట్ టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ విడుదలయిన రోజున్నరలో యూట్యూబ్ లో 5,92,096 వ్యూస్ వచ్చాయి. అదే అత్తారింటికి దారేది సినిమాకు రోజున్నరలో 4,68,564 వ్యూస్ వచ్చాయి. అంటే బాహుబలి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు వస్తున్నాడన్న మాట. దీంతో ప్రభాస్ యూట్యూబ్ లోనే కాదు, ఇక కలెక్షన్ల విషయంలోను సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తాడేమో అన్న అభిప్రాయాలు టాలీవుడ్ లో వ్యక్తమవుతున్నాయి. ఈ రికార్డు ప్రభాస్ సినిమా కెరియర్ లో ఫస్ట్ బెస్ట్, అందుకే ఆయన అభిమానుల్లో కూడా ఆనందం వ్యక్తం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: