ప్రభాస్ ను అనుష్క భయపెడుతోంది అంటున్నారు. అసలే బాహుబలి ఫస్ట్ లుక్ తో అదరగొడుతున్న ప్రభాస్ ను ఓ హీరోయిన్ భయపెట్టడం నిజంగా సంచలనమే, కాని ఇది నిజమే అంటున్నారు టాలీవుడ్ లో. కత్తి పడితే నా అంతటి వాడు లేడు అంటూ బాహుబలిలో అదరగొడుతున్న ప్రభాస్ ను అనుష్క కూడా అదే కత్తి చేత పెట్టి నేనున్నాను నీ అంతటి దానిని అని చెక్ పెట్టేందుకు ముందుకు వస్తోంది అన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. బాహుబలి ఫస్ట్ టీజర్ లో కత్తి, గుర్రపుస్వారీలతో యూ ట్యూబ్ లో ప్రభాస్ వీరవిహారం చేస్తున్న విషయం మీకు తెలిసిందే కదా. అనుష్క కూడా తను ప్రధానపాత్రగా నటిస్తున్న ‘రుద్రమదేవి’ సినిమా ఫస్ట్ టీజర్ ను విడుదల చేసేందుకు సినిమావర్గాలు సిద్దమయ్యాయి. ఇందులో అనుష్క కూడా కత్తి చేత బూని, గుర్రపు స్వారీ చేస్తూ శతృవులను చీల్చి చెండాడుతుంది. అందుకే అదే కత్తి పోరాటం, గుర్రం స్వారీతో బాహుబలి ప్రభాస్ రికార్డుకు బ్రేకులు వేయదు కదా అనుష్క అనుకుంటున్నారట సినిమావర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: