పైర‌సీ భూతానికి మ‌రో స్టార్ హీరో మూవీ బ‌లికాబోతుంది. ఎన్నో అంచ‌నాల‌తో వ‌చ్చిన భాయ్ మూవీ రెండో షో స్టార్ట్ అవుతున్న స‌మ‌యంలో ఆన్‌లైన్‌లో ఆ మూవీకు సంబంధించిన పైర‌సీ నెటిజ‌న్లకు తార‌స‌ప‌డింది. దీంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి. భాయ్ మూవీకు సంబంధించిన పైర‌సీ వీడియో కొన్ని టోరెంట్స్‌లో అందుబాటులో ఉంద‌ని, ఆ పైర‌సి లింక్‌ను చూసిన అభిమానులే నివ్వర‌పోతున్నారు. భాయ్ మూవీకు సంబంధించిన పైర‌సీ సెల్ ప‌నిచెస్తున్నప్పటికి ఆ లింక్‌ను ఇంకా తీసివేయ‌క‌పోవ‌డంతో అభిమానుల్లో ఆందోళ మొద‌లైంది. అత్తారింటికిదారేది మూవీకు సంబంధించిన హైడెఫినిషిన్ క్యాలిటి పైర‌సీను త‌మిళనాడులో పోలీసులు ప‌ట్టుకున్నారు. అదే విధంగా భాయ్ మూవీకు సంబంధించిన పైర‌సి వీడియో కూడ త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌రిగిందే అని కొంత మంది చెబుతున్నారు. ఏదేమైనా భాయ్ మూవీకు సంబంధించిన ఎటువంటి పైర‌సీ లింక్‌ల‌ను స్నేహితుల‌తో పంచుకోవ‌డం వంటి చేయవ‌ద్దని, దానికి సంబంధిన లింక్‌ల‌ను యాంటి పైర‌సి సెల్ తీసివేసే ప‌నిలో ఉంద‌ని టాలీవుడ్ చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: