బాలక్రిష్ణతో మెగా బ్రదర్ ఖరారయ్యాడు, అదేంటి నిన్న కాక మొన్ననే బాలయ్యతో పవన్ భేటి అయ్యాడు అన్న వార్త రచ్చరచ్చ సృష్టించిన విషయం ఇంకా ఆరక ముందే ఇదేంటి అనుకుంటున్నారా.. కాని ఇది నిజం, అయితే కాస్తా డిఫరెంట్ అన్నమాట. వీరిద్దరు కలుసుకుంటున్నది రాజకీయాల్లో కాదు, సినిమాల్లో. బాలక్రిష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘లెజండ్’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలక్రిష్ణతో పాటు ఓ ముఖ్యమైన పాత్రలో మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీళ్ల ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో బాలక్రిష్ణ ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడు, తండ్రీ, కొడుకు పాత్రల్లో నటిస్తున్నాడట. తండ్రి బాలక్రిష్ణతో నదియా జోడి కడుతోంది. ఇక హీరోయిన్లుగా రాధికా ఆమ్టే, సోనాల్ చౌహాన్ లు బాలక్రిష్ణతో జోడి కడుతున్నారు. సింహా లో డాక్టర్ గా, లెక్చరర్ గా చేసిన డబుల్ రోల్ హిట్టిచ్చిన సెంటి మెంట్ ఈ సినిమాకు కూడా వర్కవుట్ అవుతుంది అని బాలక్రిష్ణ అనుకుంటున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: