మహేష్ బాబు, రాంచరణ్ లను ప్రముఖ నిర్మాత రాంగోపాల్ వర్మ అవమానించాడు, అంతే కాదు, ఆయన మాటల్లో ఒకప్పటి మహేష్ తండ్రి సూపర్ స్టార్ క్రిష్ణ, రాంచరణ్ తండ్రి మెగా స్టార్ చిరంజీవి లను కూడా పరోక్షంగా అవమానించాడు అంటూ టాలీవుడ్ లో వాఖ్యలు వినిపిస్తున్నాయి. రాంగోపాల్ వర్మ తాజాగా మీడియాతో మాట్లాడుతూ నేను ఎప్పుడు సూపర్ స్టార్, మెగా స్టార్ లతో సినిమాలు తీయను అన్నాడు, అంటే వారిద్దరిని ఆయన అవమానించాడు అంటున్నారు ఈ మాటలు విన్న వారంతా. సరే వర్మ ఈ మాటలెందుకన్నాడు అంటే సినిమా డైరెక్టర్ అనుకున్నవిధంగా రావాలంటే అలాంటి వారితో సినిమాలు తీయోద్దు అన్నది ఆయన మాటల్లోని అర్థం. కారణం సినిమా క్రియేటివిటి అంతా దర్శకుడి చేతిలో ఉంటుంది. కాని ఈసూపర్ స్టార్, మెగా స్టార్ లు డైరెక్టర్ చెప్పినట్టు వినరు, వారికి తోచినట్టు సినిమా తీయాలంటారు, అంతే కాదు ఇలా ఉండాలి, ఇలాగే నటిస్తాం అంటూ ఓ రకంగా ఆదేశిస్తారు. దీంతో సినిమాలో క్రియేటివిటీ లోపిస్తుంది. అందుకే కొత్త వారితో సినిమాలు తీస్తే వారు చెప్పినట్టు వింటారు, డైరెక్టర్ కోరుకున్న క్రియేటివిటీ సినిమాలో వస్తుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: