ఈ మద్య టాలీవుడ్ హీరోలంతా రికార్డులు కొట్టడంలోనే బిజీఅయ్యారు. అయితే వీరంతా వివిధ విభాగాల్లో వారికి వారే నెంబర్ వన్ రికార్డు కొట్టేస్తూ అందరం సేమ్ గురూ.. అని హాయిగా గడిపేస్తున్నారట. ఈ జాబితాలోకి తాజాగా అల్లు అర్జున్ కూడా వచ్చి చేరాడు. ఫేస్ బుక్ లైక్స్ లో ఏ హీరో సాధించని ఆల్ టైం రికార్డు కొట్టేసాడు బన్నీ అంటున్నారు టాలీవుడ్ లో. పవన్ తన సినిమా కలెక్షన్లతో రికార్డు, ప్రభాస్ తన టీజర్ తో రికార్డు ఇలా అల్లు అర్జున్ ఫేస్ బుక్ లైక్స్ రికార్డు అన్నమాట. అల్లుఅర్జున్ ఫేస్ బుక్ ఎకౌంట్ లో ఇప్పటి వరకు 10 లక్షల లైక్స్ వచ్చాయట. ఇంతగా ఇప్పటి వరకు టాలీవుడ్, కోలీవుడ్, మోలీ వుడ్ లలో ఏహీరోకు రాలేదంటున్నారు. అల్లుఅర్జున్ ఇప్పుడు ‘రేసు గుర్రం’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడనుకోండి. అయితే అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు తన ఫేస్ బుక్ లో కొత్త పోస్టర్లు, కొత్త ఫోటోలు అప్ డేట్ చేస్తాడట. అంతే కాదు కొత్త రిలీజ్ లు కూడా ఎప్పటికప్పుడు ఉంచుతాడట, అందుకే ఆయనకు ఫేస్ బుక్ లో అంత మంది అభిమానులున్నారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: